కేరళపై కన్నేసిన జాతీయ పార్టీలు.. పట్టుకోసం ఒకరు.. విస్తరణ కోసం మరొకరు.. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ ఆరున ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మే రెండున ఫలితాలు రాబోతున్నాయి. ఉత్తరాదిలో క్రమంగా తన పట్టు కోల్పోతున్న..

కేరళపై కన్నేసిన జాతీయ పార్టీలు.. పట్టుకోసం ఒకరు.. విస్తరణ కోసం మరొకరు.. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
Follow us
K Sammaiah

|

Updated on: Mar 08, 2021 | 9:58 AM

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ ఆరున ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మే రెండున ఫలితాలు రాబోతున్నాయి. ఉత్తరాదిలో క్రమంగా తన పట్టు కోల్పోతున్న బీజేపీ దక్షిణాదిపై కన్నేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది. మరైవైపు ఇటు కాంగ్రెస్‌ సైతం కేరళపై కన్నేసింది. పట్టున్న ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరం చేసింది. ఇక లెఫ్ట్‌ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈసారి తీవ్రంగా కష్టపడుతుంది.

అయితే తమిళనాడులాగే కేరళలో కూడా ఏ కూటమి కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు.. గత నాలుగు దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఓసారి లెఫ్ట్‌ కూటమి ఎల్‌డీఎఫ్‌ విజయం సాధిస్తే మరోసారి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ గెలుస్తూ వస్తున్నాయి. మొన్నీమధ్యన జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం ఎల్‌డీఎఫ్‌ ఘన విజయం సాధించింది.. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే వస్తాయా అంటే చెప్పడం కష్టమే! ఎందుకంటే ఓటరు మనసు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ఇంచుమించు ఏడాది ముందు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.. ఆ ఎన్నికల వేళ యూడీఎఫ్‌ అధికారంలో ఉంది.. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించింది.. అంటే ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కే ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయా? ప్రజల తీర్పు ఎలా ఉండబోతున్నది? ఎల్‌డీఎఫ్‌ కనుక పరాజయం చెందితే మాత్రం అధికారంలో ఉన్న ఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా కమ్యూనిస్టులు కోల్పోయినట్టే అవుతుంది.

ఇక దక్షిణాదిలో ఎలాగైనా విస్తరించాలనుకుంటున్న బీజేపీ అదను కోసం చూస్తుంది. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా పావులు కదుపుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ బీజేపీ దూకుడు పెంచింది. అనూహ్యంగా మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను తమ పార్టీ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీధరన్ లాంటి వ్యక్తులు కేరళకు సీఎం కానుండటం మంచి పరిణామమని పేర్కొంది. మెట్రో మ్యాన్ ఈ శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మెట్రో ప్రాజెక్టుల రూపకల్పనలో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న శ్రీధరన్.. కేరళ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఆయన చరిష్మాను వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీధరన్ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కేరళలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. అంతేకాకుండా.. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు నర్మగర్భంగా చెప్పారు.

ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీధరన్‌కు దేశవ్యాప్తంగా ‘మెట్రోమ్యాన్‌’గా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ అనుభవంతో దేశంలో పలు మెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయణ సలహాలు తీసుకున్నారు. అనేక ప్రాజెక్టుల్లో ఆయన సలహాదారుగా ఉన్నారు. దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చిన వ్యక్తిగా శ్రీధరన్‌ను గుర్తిస్తారు. భారత్‌తో పాటు వివిధ దేశాల్లోనూ ఆయనకు గుర్తింపు ఉంది.‘యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కేరళ ప్రజలకు ఏమీ చేయలేదు. నేను కేరళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. ఆ లక్ష్యంతోనే బీజేపీలో చేరా’ అని శ్రీధరన్ అన్నారు. అయితే.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల ముంగిట్లో ఇలా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం… అదీ రాహుల్ గాంధీ నియోజకవర్గం కావడం హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఇది పార్టీకి నష్టం చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది.కేరళ జనం మూడ్ ఎల్‌డీఎఫ్‌కే అనుకూలంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించిన విషయం సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లడం ఎన్నికల ఫలితాలపై ఎఫెక్ట్ చూపిస్తుందన్న చర్చ జరుగుతోంది.

Read More:

సినీ గ్లామర్‌ను దట్టిస్తున్న పార్టీలు.. బెంగాల్లో రసవత్తరంగా పాలిటిక్స్‌.. బీజేపీ గాలానికి చిక్కిన మిథున్‌

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?