AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్‌ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు

YS  Sharmila Twitter Account: తెలంగాణలో కొత్త ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల స్పీడ్‌ పెంచారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని మరో ముందడుగు వేశారు. వైఎస్ షర్మిల అధికారిక..

కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్‌ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు
K Sammaiah
|

Updated on: Mar 08, 2021 | 1:19 PM

Share

YS  Sharmila Twitter Account: తెలంగాణలో కొత్త ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల స్పీడ్‌ పెంచారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని మరో ముందడుగు వేశారు. వైఎస్ షర్మిల అధికారిక ట్విట్టర్ పేజ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. దీంతో ఇవాళ మహిళా దినోత్సవం కావడంతో షర్మిల మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి ట్వీట్ చేశారు. ‘అన్నింటా మనం.. అన్నింటా సగం.. మహిళా దినోత్సవ సాక్షిగా ఇదే మన సంకల్పం’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. కాగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ఆమె ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 9న ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన వైఎస్ షర్మిల ఇప్పటికే ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల వైఎస్ అభిమానులు, నేతలతో ప్రారంభమైన షర్మిల భేటీల పరంపర కొనసాగుతోంది. తెలంగాణకు చెందిన ప్రముఖమైన వ్యక్తులతో పాటు మాజీ ఉన్నతాధికారులను సైతం షర్మిల కలుస్తున్నారు. మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను షర్మిల తన పార్టీలో సలహాదారులుగా నియమించుకున్నారు. వీరిద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక హోదాల్లో పని చేశారు. బ్రదర్ షఫీ కూడా షర్మిలను కలిసిన వారిలో ఉన్నారు. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కూడా షర్మిలను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే షర్మిల తన కొత్త పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే షర్మిల కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన మే లేదా జులైలోనే ఉండవచ్చని తెలుస్తోంది. ఇందుకు ప్రత్యేకమైన కారణం కూడా ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. 2004లో మే నెలలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాతి నెలే జులై 8న ఆయన జయంతి. అందుకే ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన వైఎస్ షర్మిల తన కొత్త పార్టీ ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో కేవలం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్, పేరు మీద మాత్రమే రాజకీయాలు చేయాలని షర్మిల భావిస్తున్నారని సమాచారం. రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు చేశాక, మరికొంత మంది అభిమానులు, నేతలను కలిశాక, అప్పుడు ప్రకటన ఇండొచ్చని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పటికే షర్మిల పేరిట ట్విట్టర్లో ఓ ఖాతా ఉంది. తాజాగా realyssharmila పేరిట ఆమె అఫీషియల్ ఖాతాను తెరిచారు. ఫిబ్రవరిలోనే ఈ అకౌంట్ ప్రారంభించగా.. నేడు మహిళా దినోత్సవం రోజున తొలి ట్వీట్ చేశారు. తను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న వేళ.. ‘‘అన్నింటా మనం.. అన్నింటా సగం. ప్రపంచ మహిళా దినోత్సవం సాక్షిగా ఇదే మన సంకల్పం’’ అని షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ తనయ కత్తి దూసిన ఫొటోను ట్వీట్ చేశారు. వెనుక బ్యాక్‌గ్రౌండ్లో చాకలి ఐలమ్మతోపాటు ఇతర ధీర నారీమణులు చిత్రాలతోపాటు.. కాకతీయ కళాతోరణం, తెలంగాణ మ్యాప్ ఉన్నాయి.

Read More:

కేరళపై కన్నేసిన జాతీయ పార్టీలు.. పట్టుకోసం ఒకరు.. విస్తరణ కోసం మరొకరు.. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

సినీ గ్లామర్‌ను దట్టిస్తున్న పార్టీలు.. బెంగాల్లో రసవత్తరంగా పాలిటిక్స్‌.. బీజేపీ గాలానికి చిక్కిన మిథున్‌

భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్