గుత్తాకు గుండె నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.. పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గుండె..
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గుండె సంబంధిత సమస్య రావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేయడంతో కోలుకున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దవాఖానకు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుత్తాను పరామర్శించిన వారిలో మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.
అనారోగ్యానికి గల కారణాలను సుఖేందర్‌రెడ్డిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్తితిపై ఆరా తీశారు. ఉదయం కొంత అనారోగ్యంగా ఉందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితిలేదని గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి వివరించారు.
అయితే ఇటీవలే గుత్తా సుఖేందర్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ సవత్సర కాలంగా దేశంలో, రాష్ట్రంలో కొత్త వ్యాధి కరోనా లక్షలాది మందికి సోకిందన్నారు. చైనా నుంచి అన్ని దేశాలకు విస్తరించిందని తెలిపారు. కరోనా వచ్చాక బాధ పడడం కంటే.. రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పారు. భారత్ బయోటెక్ ప్రపంచంలో మంచి వ్యాక్సిన్‌ను అందించిందని తెలిపారు. కోవాక్సిన్‌ను తీసుకున్నానని…తీసుకుని 40 నిమిషాలు అయినా సేఫ్‌గా ఉన్నామని అన్నారు.
టీకా ఇచ్చిన చోట నొప్పి కూడా లేదన్నారు గుత్తా . నిమ్స్ వైద్యులు నొప్పి లేకుండా వ్యాక్సిన్ ఇచ్చారని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నా ఏమి కాదని….తన వయసు 73 ఏళ్ళన్నారు. భారత్ బియోటెక్ సంస్థకు స్పీకర్ అభినందనలు తెలియజేశారు. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారన్నారు. కోవాగ్జిన్ దేశానికే గర్వకారణమని తెలిపారు. రెండో డోస్ తీసుకున్నకాక.. యాంటీ బాడీ టెస్ట్ చేయించనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ పేర్కొన్నారు
హఠాత్తుగా గుత్తా సుఖేందర్‌రెడ్డికి గుండె నొప్పి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. మరోవైపు ఈ విషయం తెలిసి గుత్తా అభిమానులు, టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. గుత్తా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుత్తా ప్రకటించారు.
Read More:
కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు
ఖమ్మం జిల్లాలో సొంత కుటుంబంలోకి కామ్రేడ్స్.. అక్కడ అధికార పార్టీ నుంచి సీపీఐలోకి వలసలు