ఖమ్మం జిల్లాలో సొంత కుటుంబంలోకి కామ్రేడ్స్‌.. అక్కడ అధికార పార్టీ నుంచి సీపీఐలోకి వలసలు

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త బలాన్ని పుంజుకుంటున్నాయి. గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారికి మళ్లీ కండువాలు కప్పే పనిలో..

ఖమ్మం జిల్లాలో సొంత కుటుంబంలోకి కామ్రేడ్స్‌.. అక్కడ అధికార పార్టీ నుంచి సీపీఐలోకి వలసలు
Follow us

|

Updated on: Mar 08, 2021 | 9:05 AM

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త బలాన్ని పుంజుకుంటున్నాయి. గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారికి మళ్లీ కండువాలు కప్పే పనిలో పాడ్డాయి ప్రధాన పార్టీలు. ఎన్నికల్లో ఒక్కొక్క ఓటు ఇంపార్టెంటే కాబట్టి వీలున్న చోట తమ బలాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఖమ్మం జిల్లా అంటేనే ఎర్రజెండా పార్టీలకు ఆయువు పట్టు. అలాంటి చోట వివిధ కారణాల చేత పార్టీని వీడిన వారిపై సీపీఐ నేతల కన్నేశారు.

అయితే సాధారణంగా ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి చేరడం ఆనవాయితీ కాని ఖమ్మం జిల్లాలో మాత్రం సీన్‌ రివర్స్‌గా మారింది. అధికార పార్టీ నుంచి రివర్స్‌గేర్‌ ఏస్తున్నారు ఒకప్పటి కామ్రేడ్‌. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలంతా సొంత కుటుంభం వైపు మళ్లుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బసవాపురం గ్రామంలో అధికార పార్టీ టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల నుండి దాదాపు 60 కుటుంబాలు సిపిఐ లోకి చేరాయి.

మాజీ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు, ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సిపిఐ పార్టీ ని విడిచి అధికార పార్టీ టిఆర్ఎస్ లోకి వెళ్లినవారు అధికార పార్టీ పోకడలు నచ్చక తిరిగి తమ సొంత గూటికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే ఒక కామ్రేడ్స్ వల్లే అవుతుంది అని రాష్ట్రంలోనూ దేశంలోనూ పోరాడేది తామే అని అన్నారు.

రాబోయే రోజుల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేసి గ్రామగ్రామాన పార్టీని పటిష్టం చేస్తామని తెలిపారు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు ఏనాడు పార్టీ నీ వీడలేదు ఇప్పటికీ పార్టీ కోసమే పని చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగం హేమంతరావు పోటు ప్రసాదు గ్రామ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు పోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లారాజేశ్వర్‌రెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే మకాం వేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి సీపీఐలోకి మారడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read More:

సైకిల్‌ ర్యాలీతో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌.. పెరిగిన ధరలకు నిరసనగా ఆ పార్టీలను ఓడించాలన్న భట్టి

బీజేపీతోనే సీఎం కేసీఆర్ నోటి వెంట‌ హిందువు అనే పదం .. ఐటీఐఆర్‌పై రాష్ట్రం నివేదిక ఇవ్వలేదన్న బండి సజయ్‌