AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. ఎన్నికలవేళ పేలుతున్న మాటల తూటాలు.. సువేందు వ్యాఖ్యలను తప్పబట్టిన ఉమర్ అబ్దుల్లా

ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

బెంగాల్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. ఎన్నికలవేళ పేలుతున్న మాటల తూటాలు.. సువేందు వ్యాఖ్యలను తప్పబట్టిన ఉమర్ అబ్దుల్లా
Balaraju Goud
|

Updated on: Mar 08, 2021 | 7:40 AM

Share

West Bengal assembly elections 2021: ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతల మాటలకు టీఎంసీ సహా మిత్రపక్షాలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి. అటు… జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై మరోసారి విమర్శలు కురిపించారు. బెంగాల్ మరో కశ్మీర్ అయితే ఏంటంటూ వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచిపారాలో బీజేపీ నందిగ్రామ్ అభ్యర్థి సువేందు అధికారి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సువేందు మాట్లాడుతూ… తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే బెంగాల్‌ మరో కాశ్మీర్‌లా మారిపోతుందన్నారు. సువేదు అధికారి చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో స్పందించారు. సువెందు వ్యాఖ్యలపై ఒమర్ ట్విట్టర్‌లో రిప్లై ఇస్తూ… ఆయన వ్యాఖ్యలు మూర్ఖమైనవని, అర్థరహితమైందని దుయ్యబట్టారు. 2019లో ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ స్వర్గంలా మారిందని బీజేపీ నేతలు చెప్తున్నారని… అలాంటప్పుడు బెంగాల్ కూడా కాశ్మీర్‌లా మారితే తప్పేమిటని ప్రశ్నించారు. బెంగాలీలు కశ్మీర్‌ను ఎంతో ఇష్టపడతారని, అందువల్ల మీ ‘స్టుపిడ్’, టేస్ట్ లెస్ కామెంట్‌ను క్షమిస్తున్నానంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు.

అయితే… ఉగ్రవాదుల దాడులు , హింసతో కాశ్మీర్ ఎప్పుడూ సతమతం అవుతుందని.. అందువల్ల ఈ రాష్ట్రాన్ని కూడా అలా మార్చరాదన్నదే సువెందు అధికారి ఉద్దేశంగా తెలుస్తోంది. కానీ, ఈ వ్యాఖ్యలను ఒమర్ అబ్దుల్లా తప్పు పట్టారు. ఇక.. బెంగాల్ లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం భారీగా పారా మిలిటరీ బలగాలను తరలిస్తున్నారు, ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో కెల్లా బీజేపీ బెంగాల్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది.

Read Also..  నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. పలు కీలక బిల్లులకు ఆమోదం.. సభ్యుల హాజరుపై అనుమానాలు