బీజేపీతోనే సీఎం కేసీఆర్ నోటి వెంట‌ హిందువు అనే పదం .. ఐటీఐఆర్‌పై రాష్ట్రం నివేదిక ఇవ్వలేదన్న బండి సజయ్‌

తెలంగాణలో అధకార పార్టీ అరాచకాలు మితిమీరుతున్నాయని బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ విమర్శించారు. ఇసుక మాఫియా ల మీద భూ కబ్జా ల మీద వార్తలు రాస్తే రిపోర్టల మీద కేస్ లు పెడుతున్నారని..

  • K Sammaiah
  • Publish Date - 7:22 am, Mon, 8 March 21
బీజేపీతోనే సీఎం కేసీఆర్ నోటి వెంట‌ హిందువు అనే పదం .. ఐటీఐఆర్‌పై రాష్ట్రం నివేదిక ఇవ్వలేదన్న బండి సజయ్‌

తెలంగాణలో అధకార పార్టీ అరాచకాలు మితిమీరుతున్నాయని బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ విమర్శించారు. ఇసుక మాఫియా ల మీద భూ కబ్జా ల మీద వార్తలు రాస్తే రిపోర్టల మీద కేస్ లు పెడుతున్నారని ఆరోపించారు. టి ఆర్ ఎస్ పార్టీ ఓట్లర్లకు వార్నింగ్ ఇస్తుంది. బీజేపీ టి ఆర్ ఎస్ కు వార్నింగ్ ఇస్తుంది. పట్టభద్రుల ఎన్నికలు ఇక వారం రోజులు ఉన్నాయి. ఎప్పుడైనా ఓట్లు వేయమని కేసీఆర్ ఆడిగారా అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు. అలాంటి పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని పట్టభద్రులను ప్రశ్నించారు.

వరంగల్ లో పేద బ్రహ్మణుడి హత్య జరుగుతే ఎందుకు సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు బండి సంజయ్‌. పివి నర్సింహ రావు ఘాట్ కూల్చాలని ఒవైసీ అంటే ఎందుకు కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు. పివి నర్సింహ రావు కూతురు వాణి ఎందుకు టి ఆర్ ఎస్ నుండి పోటీ చేస్తున్నారు. మీ నాన్న ఘాట్ కూల్చుతాను అని mim పార్టీ అంటే కేసీఆర్ ఎం స్పందించలేదు. పివి శత జయంతి వేడుకలకు 10 కోట్లు రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా పివి శత జయంతి వేడుకలు జరపలేదన్నారు.

రాష్ట్రంలో అడ్వకేట్స్ కు 100 కోట్ల నిధి ఏర్పటూ చేస్తామని కేసీఆర్ చెప్పుతున్నారు. వామనరావు దంపతుల హత్య జరుగుతే కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదని బండి సంజయ్‌ విమర్శించారు. బార్ కౌన్సిల్ మీద కేసీఆర్ కు నమ్మకం లేదు. బార్ పైనే నమ్మకం ఉంది. బండి సంజయ్ బాషా మార్చుకో అంటున్నారు కేటీఆర్. ఖచ్చితంగా మార్చుకుంటా యూ ట్యూబ్ లో మీ నాన్న కేసీఆర్ ఎం మాట్లాడిండో చూస్తాను. అంతకంటే ఎక్కవగా నేను మాట్లాడుతాను. నశం పెట్టి కొడుతాను అని కేసీఆర్ అన్నారు. నశంలో జెండుబాంబు పెట్టి మేము కొడుతామని బండి సంజయ్‌ హెచ్చరించారు.

కేంద్ర నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రేషన్ బియ్యం కు రూ.29 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రేషన్ షాప్ ముందు కేసీఆర్ ఫొటోలు పెట్టుకుంటున్నారు. చెట్ల పైసలు, రోడ్ల పైసలు, టాయిలెట్లు పైసలు, స్మశాన వాటిక నిధులు అన్ని కేంద్రానివే. 2017 లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ పైన నివేదిక ఇవ్వమని అడిగితే ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కి స్థలం ఇవ్వలేదు. అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ కు వచ్చింది. స్టాండింగ్ కమిటీలో స్మార్ట్ నిధులకు సంబందించిన నిధులు ఎక్కడికి పోయాయి అని నేను ias అధికారి అరవింద్ కుమార్ ను నిలదీసాను. రీజనల్ రింగ్ రోడ్ ను 13వందల కోట్ల తో కేంద్రం మంజూరు చేసింది. రీజనల్ రింగ్ రోడ్డు కు స్థలం ఇవ్వకపోతే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. బీజేపీ లక్ష్యం 2023 లో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురవేయడమేనన్నారు బండి సంజయ్‌.

అవినీతి పరులు ఢిల్లీలో ఉన్నా, ఫామ్ హౌస్ లో ఉన్నా బయటకు తీసుకవస్తాం. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండలు పెట్టారు. పొర్లి దండలు పెట్టిన కేసీఆర్ ను వదులం. రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగలతో దున్నుతాను అన్న సీఎం కేసీఆర్ ఎక్కడికి పోయారన్నారు బంబి సంజయ్‌. అందరి చిట్టా మా ముందు ఉంది అందరి సంగతి చూస్తాను. కార్పొరేట్ స్కూల్ లో వేల వేల ఫీజ్ లు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్ లో పని చేసే టీచర్స్ కు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు. ప్రవేట్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. కార్పొరేట్ స్కూల్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు,టి ఆర్ ఎస్ నేతలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీ కి చందాలు ఇస్తున్నారు. పీఆర్సీ పైన పోరాటం చేసింది బీజేపీనే అని బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ వల్లే పీఆర్సీ కమిటీ వేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. బీజేపీ కార్యకర్తలు ఎక్కడ ఉద్యమాలు, పోరాటాలు చేస్తే అక్కడ లాఠీ ఛార్జ్ లు చేశారు. 20 మంది కార్యకర్తలను జైల్ కు పంపించారు. గుర్రంపోడు లో గిరుజనులను ఈ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించి గిరిజనులను వేదించారు. గిరుజనులకు బీజేపీ అండగా ఉండాలని గుర్రంపోడు వెళితే బీజేపీ కార్యకర్తల పైన పోలీస్ లు ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలను మఫ్తి లో వచ్చి అరెస్ట్ చేసి జైల్ పెడుతున్నారని బండి సంజయ్‌ విమర్శించారు.

ఈ ప్రభుత్వానికి పోలీస్ లు ఇంత చేస్తున్నా పోలీసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులకు ఇప్పటి వరకు ప్రమోషన్ లేదు. చల్లా ధర్మారెడ్డి అనుచరులు బీజేపీ కార్యకర్తలపైన, కార్యాలయం పైన దాడి చేసినా కేస్ పెట్టలేదు. అదే బీజేపీ కార్యకర్తల మీద అక్రమ కేస్ లు పెట్టి జైల్ కు పంపించారు. కేసీఆర్ ప్రగతి భవన్ కింద నీళ్లు వచ్చిన కేసీఆర్ బయటకు రాలేదు. హైదరాబాద్ నీట మునిగితే కనీసం కేసీఆర్ బయటకు వచ్చి పరామర్శించలేదు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ ఎక్కడికి బయటకు రాలేదు ప్రజలను అదుకోలేదు. కరోనా సమయంలో ఏ పార్టీ రాలేదు…ఎవరు సహాయం చేయలేదు… బీజేపీ పార్టీనే ముందుకు వచ్చి సహాయం చేసిందని బండి సంజయ్‌ తెలిపారు.

కరోనా సమయంలో సేవ చేస్తూ నలుగురు బిజెల్ కార్యకర్తలు చనిపోయారు. రైతులు అకాల వర్షాలతో పంట నష్టము జరుగుతే సీఎం కేసీఆర్ ఎక్కడికి రాలేదు. కేసీఆర్ కు తెలంగాణ ను పాలించే అర్హత లేదన్నారు బండి సంజయ్‌. సీఎం నోటి నుండి హిందువు అనే పదం రావడానికి బీజేపీ నే కారణం అన్నారు బండి సంజయ్‌. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కూడా నేను హిందువు అన్నాడు కారణం బీజేపీ. 12 శాతం ముస్లింలు ఉన్న బీహార్ లో mim 5 సీట్లు గెలిచింది. తెలంగాణ లో 80 శాతం హిందువులు ఉన్నారు రెండు ఎమ్మెల్సీ స్థనాలు ఎందుకు గెలువ వద్దు అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

అయోధ్య రాముడు ఉత్తరప్రదేశ్ అన్నారు ఒక్క టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే. మరి ఆయన అయ్యప్ప మాల వేసుకొని కేరళ ఎందుకు వెళతారని ప్రశ్నించారు. పెడితే పెండ్లి కోరుతారు… లేకపోతే చావు కోరుతారు. 80 శాతం హిందువులు ఉన్న భారతదేశంలో అయోధ్య రాముడు గుడి కట్టడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టిందా అని ప్రపంచ దేశాల్లో చర్చించుకున్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 4 లక్షల మంది త్యాగం చేశారు. రామ మందిరం ఇన్ని సంవత్సరలు పట్టడానికి గత పాలకుల పాపం. అందుకే మోడీ రామమందిరాన్ని అయోధ్యలో నిర్మిస్తున్నారు. రామ రాజ్యం నెలకొల్పడానికి ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నుంచి తెలంగాణ తల్లి విముక్తి కోరుకుంటుంది. అందుకే తెలంగాణ లో బీజేపీ మాలి దశ ఉద్యమం ప్రారంభించింది. 2 ఎమ్మెల్సీ స్థానాలో బీజేపీ ని గెల్పించండి అని బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.