AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైకిల్‌ ర్యాలీతో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌.. పెరిగిన ధరలకు నిరసనగా ఆ పార్టీలను ఓడించాలన్న భట్టి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్‌ తరపున సీఎల్‌పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క విస్తృత ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను..

సైకిల్‌ ర్యాలీతో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌.. పెరిగిన ధరలకు నిరసనగా ఆ పార్టీలను ఓడించాలన్న భట్టి
K Sammaiah
|

Updated on: Mar 08, 2021 | 7:43 AM

Share

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ, కాంగ్రెస్‌, బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కీలక నేతలంతా జిల్లాలోనే మకాం వేస్తూ పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్‌ తరపున సీఎల్‌పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క విస్తృత ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపిపుతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాతలకు బుద్ధి చెప్పడానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైకిల్ యాత్ర చేపట్టారు. వాహనాలు నడపలేని, వంట గ్యాస్ కొనలేని స్థితి కల్పించిన 2 ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికే ఈ సైకిల్ యాత్ర చేపట్టామని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క యాత్ర ను ఉద్దేశించి మాట్లాడారు.

తెరాస, బీజేపీ పార్టీ లు సామాన్య ప్రజల స్థితిగతులను అంచనా వేయకుండా ప్రజల నడ్డి విరిచే విధంగా ఒక్కసారిగా పెట్రోల్, డీజీల, గ్యాస్ ధరలు పెంచాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన సైకిల్‌ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం ప్రభుత్వాలపై వ్యతిరేకతను చాటుతుందిన భట్టి విక్రమార్క తెలిపారు.

అంతకు ముందు భద్రాద్రి రామయ్య ను భట్టి విక్రమార్క సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద సైకిల్ యాత్రను ప్రారంభించిన భట్టి కి మహిళలు, హారతులు పట్టి, తిలకం దిద్దారు. అనంతరం సైకిల్ యాత్రను ప్రారంభించారు. భట్టి తోపాటు స్థానిక mla పొదేం వీరయ్య, mlc జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ బలరాం నాయక్, mlcఅభ్యర్థి రాములు నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ mlc అభ్యర్థి రాములు నాయక్ ఎన్నికల ప్రచారాన్ని కూడా వాహనాలలో ప్రచారం చేయడానికి పెట్రోల్, డీజిల్ ధరలు చూసి తట్టుకోలేక ఈ సైకిల్ యాత్రద్వారా ప్రచారాన్ని చేస్తున్నామని భట్టి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని భట్టి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి రాములు నాయక్‌ను గెలిపించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కోరారు.

Read More:

బీజేపీతోనే సీఎం కేసీఆర్ నోటి వెంట‌ హిందువు అనే పదం .. ఐటీఐఆర్‌పై రాష్ట్రం నివేదిక ఇవ్వలేదన్న బండి సజయ్‌