AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రాన్స్‌ నార్మండి తీరప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఫ్రెంచ్‌ బిలియనీర్‌ ఒలివియర్‌ డస్సాల్ట్‌ దుర్మరణం..

ఫ్రెంచ్‌ బిలియనీర్‌, ఎంపీ ఒలివియర్‌ డస్సాల్ట్‌ ‌(69) హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఫ్రాన్స్‌లోని నార్మండి తీరప్రాంత రిసార్ట్ సమీపంలో హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు పార్లమెంటరీ దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

ఫ్రాన్స్‌ నార్మండి తీరప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్..  ఫ్రెంచ్‌ బిలియనీర్‌ ఒలివియర్‌ డస్సాల్ట్‌ దుర్మరణం..
Balaraju Goud
|

Updated on: Mar 08, 2021 | 9:20 AM

Share

Olivier Dassault : ఫ్రెంచ్‌ బిలియనీర్‌, ఎంపీ ఒలివియర్‌ డస్సాల్ట్‌ ‌(69) హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. వాయువ్య ఫ్రాన్స్‌లోని నార్మండి తీరప్రాంత రిసార్ట్ సమీపంలో ఆ దేశ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు పార్లమెంటరీ దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో పైలెట్‌ కూడా మరణించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ప్రైవేట్ మైదానం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని ఫ్రాన్స్ జాతీయ వైమానిక క్రాష్ దర్యాప్తు సంస్థ బీఏ ట్వీట్‌లో తెలిపింది. ఇటీవల భారతదేశానికి సరఫరా చేసిన రఫెల్ యుద్ద విమానాలను వీరి సంస్థలోనే తయారయ్యాయి. ఒలివియర్‌ మృతిపట్ల ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్‌తో పాటు ఒలివియర్‌ ఒక్కరే ఉన్నారు. ఒలివియర్‌ తాత మార్సెల్‌ డస్సాల్ట్‌ ప్రపంచంలో పేరొందిన డస్సాల్ట్‌ ఏవియేషన్‌ను నెలకొల్పారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఒక ట్వీట్‌లో “ఆలివర్ డసాల్ట్ ఫ్రాన్స్‌ దేశాన్ని అమితంగా ప్రేమించేవాడని, అతని మరణం తీరని లోటు. పరిశ్రమల స్థాపకుడిగా, స్థానిక ఎంపి, వైమానిక దళంలో రిజర్వ్ కమాండర్‌గా ఆయన సేవలు మరవలేనివి. తన జీవితాంతం అతను మన దేశానికి సేవ చేయడాన్ని ఎప్పుడూ ఆపలేదు” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

డసాల్ట్ ఏవియేషన్ గ్రూప్ గత 70 సంవత్సరాలుగా ఫ్రెంచ్ విమానాల తయారీలో ప్రముఖంగా ఉంది. ఫాల్కన్ ప్రైవేట్ జెట్, మిరాజ్ యుద్ధ విమానం, ఇటీవల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రాఫెల్ ఫైటర్ తయారీ వెనుక ఆయన కృషీ ఎంతగానో ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ 2020 లో ఆలివర్ డసాల్ట్ ఈ గ్రహం మీద 361 వ అత్యంత సంపన్న వ్యక్తి అని పేర్కొంది. ఆయన సంపద ఐదు బిలియన్ యూరోలు (6 బిలియన్ డాలర్లు) గా అంచనా వేసింది.

ప్రఖ్యాత ఏరోనాటికల్ ఇంజనీర్ అయిన మార్సెల్ బ్లోచ్ మనవడు ఆలివర్, అతను తన పేరును “డసాల్ట్” గా మార్చుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ విమానంలో ఉపయోగించిన వినూత్న ప్రొపెల్లర్‌ను అభివృద్ధి చేయడానికి సహాయం చేసిన తరువాత, మార్సెల్ రెండవ ప్రపంచ యుద్ధంలో జైలు పాలయ్యాడు. జర్మనీ విమానయాన పరిశ్రమతో సహకరించడానికి నిరాకరించిన తరువాత నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌ నుంచి మార్సెల్‌ను బహిష్కరించింది. ఇక, కంట్రోల్ ఆఫ్ డసాల్ట్ ఏవియేషన్ ఆలివర్ తండ్రి సెర్జ్‌క్ బాధ్యతలు చేపట్టారు. అతను తన పారిస్ కార్యాలయంలో గుండెపోటుతో 2018 లో మరణించినప్పుడు అతని తరువాత వారసుడిగా ఆలివర్ డసాల్ట్ బాధ్యతలు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి ఫ్రెంచి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు అదేశించింది.

ఇదీ చదవండిః  International Women’s Day 2021: ‘మహిళా దినోత్సవం’ ప్రత్యేకమైన సందేశాలు మీకోసం…