Gadchiroli Encounter: మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. 26 మంది మావోయిస్టుల మృతి.. ముగ్గురు జవాన్లకు గాయాలు

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు.

Gadchiroli Encounter: మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. 26 మంది మావోయిస్టుల మృతి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
Encounter
Follow us

|

Updated on: Nov 13, 2021 | 7:57 PM

Gadchiroli Encounter in Maharashtra: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. గ్యారపట్టి అటవీప్రాంతంలో ఉదయం నుంచి మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఓవైపు అగ్రనేతల మరణం.. మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. గత నెలలోనే మావోయిస్టు అగ్రనేత ఆర్కే చనిపోయారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు ఈశాన్య ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో శనివారం ఉదయం నుండి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 26 మంది మావోస్టులు మరణించారు. ఈ విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు అనేక మావోయిస్ట్ శిబిరాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఈ ఆపరేషన్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించారు. ఇది కొన్ని గంటల పాటు కొనసాగింది. ఈ భారీ ఆపరేషన్‌లో 26 మంది నక్సలైట్లను హతమార్చడమే కాకుండా ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు.

గడ్చిరోలి జిల్లా కోర్చి తాలూకాలోని కోట్‌గుల్ ప్రాంతంలోని ఎలెవెన్‌బట్టి అడవుల్లో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీని తర్వాత, సి-60 అనే పోలీసు బృందం మావోయిస్టులపై ఆపరేషన్‌ను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత బృందం సెర్చ్ ఆపరేషన్‌కు బయలుదేరింది. వెంటనే పోలీసు బృందం మావోయిస్టు స్థావరాలకు చేరుకుంది. మావోయిస్టులు పోలీసుల రాకపై సమాచారం అందుకున్నారు. మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో మొత్తం 26 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు. ఈ నలుగురు నక్సలైట్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.

‘క్రాక్ కమాండోలు’ ఎవరు? మహారాష్ట్ర పోలీసులకు చెందిన సి-60 స్క్వాడ్ ఈరోజు గడ్చిరోలిలో 26 మంది మావోయిస్టులను హతమార్చింది. బుధవారం మావోయిస్టుల దాడిలో 15 మంది పోలీసు కమాండోలు వీరమరణం పొందిన తర్వాత ఈ ప్రతీకార చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. జవాన్లందరూ ఎలైట్ సి-60 వింగ్‌లో సభ్యులు. మావోయిస్టుల హింసను ఎదుర్కోవడానికి ఈ వింగ్ ప్రత్యేకంగా 1990లో ఏర్పాటు అయ్యింది. తెలంగాణలోని గ్రేహౌండ్ బలగాలు, ఆంధ్రప్రదేశ్‌లోని SOG ప్రత్యేక విభాగం లాగే, C-60 మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల హింసను ఎదుర్కోవడానికి బాధ్యత వహిస్తుంది. C-60 కమాండోల సహకారాన్ని ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. వీళ్లనే ‘క్రాక్ కమాండో’ అని కూడా అంటారు.

Read Also…  రేపు తిరుపతిలో అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్ కౌన్సిల్.. సమస్యలు – వివాదాల చిట్టాతో రాష్ట్రాలు రెడీ!

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి