నేడు తిరుపతిలో అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్ కౌన్సిల్.. సమస్యలు – వివాదాల చిట్టాతో రాష్ట్రాలు రెడీ!

రేపే సదరన్‌ జోనల్ కౌన్సిల్ సమావేశం కాబోతుంది.. కేంద్రంతో సమస్యలు -వివాదాల చిట్టాతో యుద్ధానికి రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. మరి కేంద్రం ఏ సమాధానం చెబుతుంది?

నేడు తిరుపతిలో అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్ కౌన్సిల్.. సమస్యలు - వివాదాల చిట్టాతో రాష్ట్రాలు రెడీ!
Amit Shah
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 14, 2021 | 9:23 AM

Southern Zonal Council meet: నేడు సదరన్‌ జోనల్ కౌన్సిల్ సమావేశం కాబోతుంది.. కేంద్రంతో సమస్యలు -వివాదాల చిట్టాతో యుద్ధానికి రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. మరి కేంద్రం ఏ సమాధానం చెబుతుంది? ముఖ్యంగా నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కేంద్రం చిన్నచూపుచూస్తోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అటు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కూడా ఓరేంజ్‌లో నడుస్తోంది. ఇక మీటింగ్‌ను అడ్డుకుంటామని ప్రకటించింది CPI. ఈ నేపథ్యంలో జరుగుతున్న మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

29వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆధ్యాత్రికం కేంద్ర తిరుపతి వైదికైంది. ఈ సమావేశానికి కేంద్ర హోమంత్రి అమిత్‌షా అధ్యక్షత వహిస్తారు. ఈ మీటింగ్‌కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, కర్నాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై హాజరవుతున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి సీఎంలకు బదులుగా మంత్రులు, ఉన్నతాధికారులు వస్తున్నట్లు సమాచారం. అయితే, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. మెుత్తంగా 48 అంశాలపై చర్చ జరగనుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో ఎజెండాతో ఈ సమావేశానికి వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న అనేక అంశాలను సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. పునర్ విభజన చట్టంలోని అంశాలు, ఇప్పటివరకు పరిష్కారం కాని సమస్యలతో ఎజెండా సిద్ధమైంది.

దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచనలు చేయనున్నారు. బెంగుళూరులో జరిగిన 28వ సదరన్ కౌన్సిల్‌లో తీసుకున్న డెసిషన్స్‌పైనా సమీక్ష చేస్తారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలను 5 జోనల్ కౌన్సిళ్లుగా విభజించి ఈ సమావేశాలు నిర్వహిస్తోంది కేంద్రం. ఇక సౌత్‌ స్టేట్స్‌ కేంద్రానికి మధ్య కాస్త గ్యాప్‌ ఉంది. ఒక్క కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాలు అసంతృప్తితోనే ఉన్నాయి. నిధుల విషయం లో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిపై వివక్ష కొనసాగుతోందన్నది ప్రధాన ఆరోపణ. అందుకే నిధుల కేటాయింపు అంశాన్ని అన్ని రాష్ట్రాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకే BJP తిరుపతిలో సమావేశం నిర్వహిస్తోందని ఆరోపిస్తోంది CPI. ఇందుకు నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించింది. మరోవైపు, కేంద్ర హోం మంత్రితోపాటు ఇతర ముఖ్యనేతలంతా వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు..15వందల మంది పోలీసుల్ని మోహరించారు.

Read Also…  World Polluted Cities: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.. మొదటి 10 నగరాల్లో మూడు భారత్‌వే!

Latest Articles
అత్యంత ప్రమాదకరమైన ఫ్లైఓవర్.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్ల ఫైర్
అత్యంత ప్రమాదకరమైన ఫ్లైఓవర్.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్ల ఫైర్
నాలుగో విడతలో 94 స్థానాలకు పోలింగ్.. బరిలో కీలక నేతలు..
నాలుగో విడతలో 94 స్థానాలకు పోలింగ్.. బరిలో కీలక నేతలు..
కీలక మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ఎవరికి లాభం.. ఓడితే ఎవరికి నష్టం
కీలక మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ఎవరికి లాభం.. ఓడితే ఎవరికి నష్టం
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ 2024 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ ఓటు రద్దు అవుతుంది.. చట్టప్రకారం జైలుకే
బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ ఓటు రద్దు అవుతుంది.. చట్టప్రకారం జైలుకే
చార్‌ధామ్ భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న బద్రినాథ్‌ ఆలయ తలుపులు
చార్‌ధామ్ భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న బద్రినాథ్‌ ఆలయ తలుపులు
ప్లేఆఫ్ చేరాలంటే ఆర్‌సీబీకి డూఆర్‌డై మ్యాచ్.. ఢిల్లీకి మరో ఛాన్స్
ప్లేఆఫ్ చేరాలంటే ఆర్‌సీబీకి డూఆర్‌డై మ్యాచ్.. ఢిల్లీకి మరో ఛాన్స్
15 రోజుల్లోనే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు!
15 రోజుల్లోనే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు!
వార్నీ ఇదేం పైత్యం తల్లి..! తినడానికి ముందు ప్లేట్‌ కడుగుతారు..
వార్నీ ఇదేం పైత్యం తల్లి..! తినడానికి ముందు ప్లేట్‌ కడుగుతారు..
గీతా గోవిందం సినిమాలో విజయ్‏ను ప్రేమించిన అమ్మాయి ఇలా మారిందేంటీ.
గీతా గోవిందం సినిమాలో విజయ్‏ను ప్రేమించిన అమ్మాయి ఇలా మారిందేంటీ.