YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో మరో సంచలనం.. వాంగ్మూలంలో అసలు విషయాలు వెల్లడించిన దస్తగిరి!
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి ఆప్రూవర్‌గా పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు. ఆగస్ట్ 30న వైఎస్ వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.
YS Vivekananda Reddy Murder Case: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి ఆప్రూవర్‌గా పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వలేదని వివేకా హత్యకు గంగిరెడ్డి ప్లాన్ చేశారని దస్తగిరి ఒప్పుకున్నారు. 40 కోట్లు ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పారని, అయినా తాను హత్య చేయలేనని చెప్పానని కన్ఫెషన్ రిపోర్టులో పేర్కొన్నాడు.
ఆగస్ట్ 30న వైఎస్ వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. వివేకా హత్యలో తనతో పాటు నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి అంగీకరించాడు.
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి ఒప్పకున్నారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు పేర్కొన్నారు. బెంగళూరులో భూముల లావాదేవీలకు సంబంధించి వాటా ఇవ్వకపోవడంపై వివేకాపై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహం పెంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి గంగిరెడ్డి మోసమే కారణమని, మీ సంగతి తేలుస్తానంటూ వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య విబేధాలు తలెత్తాయి. 2018లో వివేకా వద్ద నుంచి డ్రైవర్ వృత్తి మానివేసినట్లు దస్తగిరి తెలిపాడు. అనంతరం ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్‌ను తరచూ కలుసుకునేవాడినని దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో వివరించాడు. ఈ నేపథ్యంలో వివేకాను హతమార్చేందుకు కోటి రూపాయిలు ఇస్తామని.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు దస్తగిరి వెల్లడించాడు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయిల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు రూ.5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసినట్లు తెలిపాడు.
సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర.. కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్టు దస్తగిరి పేర్కొన్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
తమను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్‌రూమ్‌లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా బెడ్‌రూమ్‌లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని, వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడిచేసినట్టు వెల్లడించారు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడిచేశాడని వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతిపై 7, 8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 30న ప్రొద్దటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూల్ ఇచ్చారు.
వ్యక్తి శరీరంలో బొద్దింక !! సోషల్‌మీడియాలో ఎక్స్‌రే వైరల్..!