Lightning strikes: దేశంలోని పలు ప్రాంతాల్లో పిడుగుల బీభత్సం.. 24 మంది దుర్మరణం..

Lightning strikes: దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాల వల్ల ఉత్తరాది ప్రాంతాల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు

Lightning strikes: దేశంలోని పలు ప్రాంతాల్లో పిడుగుల బీభత్సం.. 24 మంది దుర్మరణం..
Lightning Strikes
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 08, 2021 | 8:15 AM

Lightning strikes: దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాల వల్ల ఉత్తరాది ప్రాంతాల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటు సంఘటనలకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు మరో 15 మందికిపైగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌, ఈస్‌ బర్ద్‌వాన్‌ జిల్లాల్లో శనివారం నుంచి తీవ్రంగా పిడుగుల వర్షం కురుస్తోంది. ఈ ఘటనల్లో మహిళ సహా నలుగురు మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు. దీంతోపాటు బీహార్‌లోని బంకా ప్రాంతంలో కూడా పిడుగులు పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో పిడుగుపాటు ఘటనలకు ఎనిమిది మంది మరణించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌, భద్రక్‌, బాలాసోర్‌ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలకు ఐదుగురు దుర్మరణం చెందినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. దేశంలోని పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. బీహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖాండ్ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగుపాటు ఘటనలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురుస్తున్న సమయంలో బయటకు రావొద్దంటూ సూచనలు చేసింది. అత్యవసమైతే తప్ప.. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దంటూ పేర్కొంది.

Also Read:

చిన్నారి ప్రాణాల మీదకొచ్చిన తల్లిదండ్రుల మధ్య గొడవ.. కన్నబిడ్డను మేడ పైనుంచి విసిరేసిన తల్లి

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల నుంచి ముప్పు.. తక్షణమే ఆ దేశాన్ని ఖాళీ చేయాలని అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం పిలుపు