AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల నుంచి ముప్పు.. తక్షణమే ఆ దేశాన్ని ఖాళీ చేయాలని అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం పిలుపు

ఆఫ్ఘానిస్తాన్ లో నివసిస్తున్న తమ దేశీయులు తక్షణమే ఆ దేశాన్ని వదిలి రావాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు కాబూల్ లోని యూఎస్ ఎంబసీ శనివారం ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల నుంచి ముప్పు.. తక్షణమే ఆ దేశాన్ని ఖాళీ చేయాలని అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం పిలుపు
Taliban
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 07, 2021 | 5:15 PM

Share

ఆఫ్ఘానిస్తాన్ లో నివసిస్తున్న తమ దేశీయులు తక్షణమే ఆ దేశాన్ని వదిలి రావాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు కాబూల్ లోని యూఎస్ ఎంబసీ శనివారం ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేసింది. తాలిబన్లకు, ఆఫ్ఘన్ దళాలకు మధ్య పోరు తీవ్రమవుతోందని, తాలిబన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా ఇక ఈ దేశంలో మీకు భద్రత లేదని ఇందులో పేర్కొన్నారు. ఆఫ్ఘన్ లో అమెరికా బలగాలు, స్టాఫ్ కూడా పరిమితంగా ఉన్నారని, అందువల్ల దాడుల నుంచి మిమ్మల్ని రక్షించలేకపోవచ్చునని ఈ ప్రకటన స్పష్టం చేసింది.పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ కారణంగా ఇక మీరు జాప్యం చేయవద్దని, విమానాలకు టికెట్ కొనలేనివారికి అవసరమైతే రుణం కూడా ఇస్తామని వివరించారు. కాబూల్ బయట దేశీయ విమానాలు పరిమితంగా ఉన్నాయి. అలాగే ట్రాన్స్ పోర్టేషన్ రూట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విమానాలను రద్దు చేయడమో..లేక ఈ మార్గాలను మూసివేయడమో కూడా జరగవచ్చు అని యూఎస్ ఎంబసీ అధికారులు పేర్కొన్నారు.

నిన్న కాబూల్ లో ఓ మసీదు వద్ద ప్రభుత్వ మీడియా హెడ్ దావా ఖాన్ ను తాలిబన్లు కాల్చి చంపారు. అంతకు ముందు రక్షణ మంత్రి బిస్మిల్లా మహమ్మద్ నివాసం వద్ద కారు బాంబు పేలుడు ఘటన జరిగింది. ఆయనను టార్గెట్ చేసుకునే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడ్డారు. పైగా ఒక్కొక్కటిగా రాష్ట్రాల రాజధానులను తమ హస్తగతం చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ దళాల వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: అస్సాం-మిజోరాం మధ్య మళ్ళీ బార్డర్ రగడ.. నాలుగు లారీలు ధ్వంసం

కుంభ్ మేళాలో లక్ష ఫేక్ కోవిడ్ టెస్టులు.. 5 ల్యాబ్ లపై ఈడీ దాడులు.. 31 లక్షల స్వాధీనం

Follow Us
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..