AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: క్షుద్ర పూజల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. మాంత్రికుడి మాటలు విని..

Black Magic: ఓ ఇంట్లో జరిగిన క్షుద్ర పూజ నెల్లూరు జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. పూజో, క్షుద్రపూజో.. ఇంకేదో.. పేరేదైతేనేం.. తంతు అంతా ఒక్కటే. మనిషిని ఆవహిస్తోన్న స్వార్థం..

Black Magic: క్షుద్ర పూజల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. మాంత్రికుడి మాటలు విని..
Subhash Goud
|

Updated on: Jun 16, 2022 | 9:52 PM

Share

Black Magic: ఓ ఇంట్లో జరిగిన క్షుద్ర పూజ నెల్లూరు జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. పూజో, క్షుద్రపూజో.. ఇంకేదో.. పేరేదైతేనేం.. తంతు అంతా ఒక్కటే. మనిషిని ఆవహిస్తోన్న స్వార్థం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. చివరకు సొంత బిడ్డల రక్తాన్నే కళ్ళజూసేలా చేస్తోంది. పెద్దిరెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్, యామినిలకు పెళ్ళయిన పుష్కరకాలానికి కవలలు జన్మించారు. లేకలేక పుట్టిన బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన తండ్రి.. అపరకాలకేయుడిగా మారాడు. మంత్రాలు, తంత్రాలను నమ్మి మూర్ఖత్వంతో పసిబిడ్డల ప్రాణాలకే ఎసరుపెట్టేశారు.

వేణుగోపాల్‌ వ్యాపారంలో నష్టపోయాడు. పూజలు చేస్తే కష్టాలు పోతాయని ఓ దొంగ బాబా చెప్పిన మాటలు నమ్మిన వేణుగోపాల్‌.. బుధవారం తన కవల కుమార్తెల్లో ఒకరైన పునర్వికను పూజ గదిలో పడుకోబెట్టి.. భార్యతో పసుపు నీళ్లు పోయించాడు. ఆతర్వాత నోట్లో కుంకమ పోయడంతో ఊపిరాడక బాలిక కేకలు వేసింది. వెంటనే చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. కండీషన్‌ సీరియస్‌గా మారడంతో నెల్లూరు ఆసుపత్రికి అక్కడి నుంచి చెన్నైకి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.

మూడు రోజులుగా మాంత్రికుడి సాయంతో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో అర్థరాత్రి, అపరాత్రీ క్షుద్రపూజలు చేస్తున్న విషయం చుట్టుపక్కల వారికి తెలిసినా ఏదో పూజలు చేసుకుంటున్నారని ఊరుకున్నారు. చిన్నపాపపై దాడి చేస్తుండగా పెద్ద కూతురు కేకలు వేయడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పసిపాపాయి ఏడుపుతో ఉలిక్కిపడిన చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేలోపే పసిపాప అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. మూఢనమ్మకాల భ్రమలో వేణు తన కన్న బిడ్డలనే కడతేర్చకునే స్థాయికి దిగజారిన ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి