Telangana: హైదరాబాద్‌ టూ మధ్యప్రదేశ్‌.. ఖాకీ సినిమాను తలపించేలా తెలంగాణ పోలీసుల డెకాయ్‌ ఆపరేషన్‌..

Telangana: హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న తీరు సినిమాను తలపిస్తోంది. 6 నెలల సుదీర్ఘ డెకాయ్‌ ఆపరేషన్‌ తర్వాత దొంగలను..

Telangana: హైదరాబాద్‌ టూ మధ్యప్రదేశ్‌.. ఖాకీ సినిమాను తలపించేలా తెలంగాణ పోలీసుల డెకాయ్‌ ఆపరేషన్‌..
Representative Image
Follow us

|

Updated on: Jun 16, 2022 | 3:53 PM

Telangana: ‘ఓ దారి దోపిడి ముఠా ఉత్తర భారత దేశం నుంచి వచ్చి సౌత్‌ ఇండియాలో దోపిడిలకు పాల్పడుతుంది. ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకొకి, అడ్డొచ్చిన వారికి అత్యంత కృరంగా హత మార్చి పారిపోతారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. దొంగల ముఠా ఉన్న చోటుకు వెళ్లి అక్కడ స్థానికులుగా మారి ముఠాను అరెస్ట్ చేస్తారు’ కార్తీ హీరోగా వచ్చిన ఖాకీ సినిమా స్టోరీ చెబుతున్నారు ఏంటి అనుకుంటున్నారా.? 

ఇలాంటి ఘటనే నిజంగా జరిగింది. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న తీరు సినిమాను తలపిస్తోంది. 6 నెలల సుదీర్ఘ డెకాయ్‌ ఆపరేషన్‌ తర్వాత దొంగలను అరెస్ట్‌ చేశారు. ఇంతకీ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు పోలీసులు ఎలా వెళ్లారు.? ఈ క్రమంలో పోలీసులు అనుసరించిన విధానం ఏంటి.? అన్న విషయాలను గురువారం సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాతో పంచుకున్నారు. ఈ డెకాయ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే…

‘మధ్యప్రదేశ్‌లోని దార్‌ జిల్లాకు చెందిన 11 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలకు దిగారు. భారీ కట్టర్స్‌, రాడ్స్‌, స్క్రూడ్రైవర్స్‌తో దొంగతనాలు పాల్పడ్డారు. వీరంతా 98 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై సైబరాబాద్‌ పరిధిలో 68 దొంగతనాలు, నిజామాబాద్‌లో10, కరీంనగర్‌లో రెండు, వరంగల్‌లో ఆరు, జగిత్యాలలో తొమ్మిది, కామారెడ్డిలో రెండు, సిద్దిపేటలో ఒక కేసు నమోదైంది. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ చేసుకొని కళ్లు మూసి తెరిచేలోపే ఇళ్లు మొత్తం దోచేస్తూ పోలీసుల నుంచి తప్పించుకుతిరుగుతున్న ఈ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పెద్ద డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి అరెస్ట్ చేశారు’ అని సీపీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్‌ సాగిందిలా..

‘ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు ముఠా సభ్యులు ఉన్న చోటుకు వెళ్లి. అక్కడ సామాన్యులుగా జీవించడం మొదలు పెట్టారు. 6 నెలల పాటు నిందితులు నివసించే ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. దార్ జిల్లా తాడా ఆదివాసీల వేషధారణలో నిందితులపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా రోడ్డు కాంట్రాక్టు, రోడ్డు పనుల కార్మికుల్లా స్థానికులతో కలిసి గస్తీ నిర్వహించారు. ఇలా ఎన్నో కష్టాల అనంతరం ఎట్టకేలకు సీక్రెట్‌ ఆపరేషన్‌ విజయవంతమైంది. ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. మరో ప్రధాన సూత్రధారి కోసం ప్రస్తుతం గాలిస్తున్నాము’ అని మీడియాకు వివరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..