కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత..

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక చామరాజనగర్ జిల్లాకు చెందిన ఓంకార్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో మానసిక వ్యధకు గురైన ఓంకార్ కుటుంబ సభ్యులను మైసూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య, కుమారుడు, తల్లి, దగ్గర బంధువైన వర్ష భట్టచార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:16 pm, Fri, 16 August 19
కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత..

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక చామరాజనగర్ జిల్లాకు చెందిన ఓంకార్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో మానసిక వ్యధకు గురైన ఓంకార్ కుటుంబ సభ్యులను మైసూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య, కుమారుడు, తల్లి, దగ్గర బంధువైన వర్ష భట్టచార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్డంకు తరలించారు. అప్పుల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలింది.