ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత.. లంచం తీసుకుంటూ.. ఏసీబీ వలలో..

కొద్ది రోజులు క్రితం ఉత్తమ ఎమ్మార్వోగా అవార్డు అందుకున్న లావణ్య.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే.. అలాంటిదే శుక్రవారం మరోటి చోటు చేసుకుంది. తిరుపతిరెడ్డి అనే ఓ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ చేతికి దొరికిపోయాడు. అయితే గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ కానిస్టేబుల్‌కి.. ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. […]

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత.. లంచం తీసుకుంటూ.. ఏసీబీ వలలో..
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 1:20 AM

కొద్ది రోజులు క్రితం ఉత్తమ ఎమ్మార్వోగా అవార్డు అందుకున్న లావణ్య.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే.. అలాంటిదే శుక్రవారం మరోటి చోటు చేసుకుంది. తిరుపతిరెడ్డి అనే ఓ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ చేతికి దొరికిపోయాడు. అయితే గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ కానిస్టేబుల్‌కి.. ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతిరెడ్డి.. శుక్రవారం ఓ ఇసుక వ్యాపారి వద్ద నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ చేతికి దొరికిపోయాడు.

ఏసీబీ అధికారి కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే ఇసుక వ్యాపారి దగ్గర కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి రెండు సంవత్సరాల నుంచి లంచాలు తీసుకుంటున్నాడు. ఆగష్టు 3న తనకు ఇసుక రవాణాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ లంచంగా రూ.17 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తిరుపతి రెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.