Mining Blast Case: పేలుళ్ల ఘటనలో వైఎస్ఆర్‌సీపీ నాయకుడు అరెస్ట్.. మరొకరు కూడా..

Kadapa mining blast case: కడప జిల్లాలో ఇటీవల జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో వైఎస్ఆర్ సీపీ నేత సి.నాగేశ్వరరెడ్డి, పేలుడు పదార్థాలు

Mining Blast Case: పేలుళ్ల ఘటనలో వైఎస్ఆర్‌సీపీ నాయకుడు అరెస్ట్.. మరొకరు కూడా..
arrest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 11, 2021 | 8:16 AM

Kadapa mining blast case: కడప జిల్లాలో ఇటీవల జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో వైఎస్ఆర్ సీపీ నేత సి.నాగేశ్వరరెడ్డి, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన రఘునాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కడప ఎస్సీఅన్బురాజన్ సోమావారం వెల్లడించారు. కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్లలో 10 మంది కూలీలు దుర్మరణం చెందారు.

2013లో జీపీఏ తీసుకుని నాగేశ్వరరెడ్డి ఈ గనిని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా లేవని, ఇక్కడ పేలుళ్లు జరపకూడదని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. గని వాస్తవ లీజుదారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఎస్పీ తెలిపారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు రఘునాథరెడ్డికి లైసెన్స్ ఉందని, అయితే వాటి రవాణా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో ఆయన్ను కూడా విచారిస్తున్నట్టు చెప్పారు.

ప్రమాదానికి కారణమైన 1000జిలెటిన్ స్టిక్స్, 120 డిటోనేటర్లను పులివెందులలో తీసుకున్నారని.. వాటిని కారులో తరలించి దింపుతుండగా పేలుళ్లు సంభవించాయన్నారు. ఈ గనికి సంబందించి పలు విషయాలపై స్పష్టత కోసం అధికారులకు లేఖలు రాశామని.. వివరణ వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

Also Read:

Remdesivir: రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్.. హెటిరో మేనేజరే సూత్రధారి.. లక్షల్లో వ్యాపారం.. చెక్ పెట్టిన నల్లగొండ పోలీస్

Covid Patients: తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్‌పై కఠిన నిబంధనలు.. ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే అనుమతి..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!