Boy Murder Case: చందాల కోసం వచ్చి బాలుడి జాతకాన్ని చూశారు.. 4 రోజులకే కిడ్నాప్, అమావాస్య రోజు దారుణం.!
కడప జిల్లా వెంగలాయపల్లెకు చెందిన తనీష్.. మొన్న 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఊరు ఊరంగా అతని కోసం గాలించారు. ఎక్కడా కనిపించలేదు. ఏమైయ్యాడో అని అందరూ కంగారు పడుతున్న
Boy murder mystery: కడప జిల్లా వెంగలాయపల్లెకు చెందిన తనీష్.. మొన్న 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఊరు ఊరంతా అతని కోసం గాలించారు. ఎక్కడా కనిపించలేదు. ఏమైయ్యాడో అని అందరూ కంగారు పడుతున్న సమయంలోనే ఓ లేఖ వారికి అందింది. అందులో 8 లక్షలు ఇస్తేనే మీ బిడ్డను వదిలేస్తేమని ఉండడంతో కిడ్నాప్ చేశారని అనుకున్నారు. వాళ్లు ఎవరో తెలియదు.. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు.. అయినా బిడ్డ ప్రాణాల కోసం అందరి దగ్గరి నుంచి 8లక్షలు పోగేసినా రెడీ చేసి పెట్టినా ఫలితం లేకుండా పోయింది.
తనీష్‌ను తీసుకెళ్లిన వ్యక్తులు.. అప్పటికే ఆ బాలుడ్ని చంపేశారు. అవును.. అక్కడే ఉన్న అంకాలమ్మ గుడి దగ్గర మృతదేహాన్ని పడేశారు. బాలుడి ఒంటిపై గాయాలు, కత్తిపోట్లను గుర్తించారు. అక్కడ కొన్ని పూజలు చేసిన ఆనవాళ్లూ కనిపించాయి. ఐదురోజుల క్రితం ఆ ఊరికి వచ్చిన కొందరు.. ఆలయం నిర్మాణం కోసం చందాలు వసూలు చేసే క్రమంలో ఈ బాలుడి జాతకాన్ని చూశారంట. వారు చూసిన నాలుగురోజులకే తనీష్ హత్యకు గురికావడం, అందులోనూ అమావాస్య కావడం.. అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
తనీష్‌ను ఎందుకు చంపారు.. ఎవరు చంపారన్నది అంతుచిక్కుండా ఉంది. అభంశుభం తెలియని బాలుడిని బలితీసుకున్న వారెవరో గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. తమ అత్యాసలకోసం, మూఢనమ్మకాలతో ఏ పాపం ఎరుగని బాలుడిని చంపడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలుడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఐదురోజుల క్రితం వరకు ఆడుతూ పాడుతూ కనిపించిన తనీష్.. ఆకస్మాత్తుగా అదృశ్యమై అందనంత దూరానికి వెళ్లిపోవడంపై స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read also: కృష్ణా జిల్లాలో విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతుండగా.. గుండె ఆగినంత పనైంది.!