AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadari Kishore: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను విమర్శిస్తే ఊరుకోం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు బెదిరింపు!

టీఆర్‌ఎస్‌ ఎమెల్యే గాదరి కిషోర్‌.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.

Gadari Kishore: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను విమర్శిస్తే ఊరుకోం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు బెదిరింపు!
Mla Gadari Kishore
Balaraju Goud
|

Updated on: Aug 10, 2021 | 4:48 PM

Share

Threatening Call to MLA Gadari Kishore: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేందుకు కొత్త పథకాలతో ఆకట్టుకుంటోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రజలకు సేవ చేస్తానంటూ తన పదవికి రాజీనామా చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇటీవల బీఎస్పీ పార్టీలో చేరిపోయారు. నల్గొండలో ఏర్పాటు చేసిన జాయిన్ మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సోమవారం టీఆర్‌ఎస్‌ ఎమెల్యే గాదరి కిషోర్‌.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.

అయితే, ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.. అంతేకాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అయితే.. ఆ తర్వాత ఓ వ్యక్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు ఫోన్‌ చేసి బెదిరించిన ఆడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి ఫోన్‌ చేసి.. తాను సంపత్ స్వేరో అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టాడు.. ఫోన్‌లో ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించాడు.. ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి నీదా అంటూ.. కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడిన సంపత్‌.. మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు.. అయితే, అదే స్థాయిలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ రియాక్ట్ అయ్యారు.

“నా స్థాయి ఏంటో నాకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చిన ఆయన.. గాదరి కిషోర్ అంటే ఏంటో చూస్తావా.. 172 కేసులు పెట్టుకుని జైలు పాలై వచ్చిన వ్యక్తిని.. ఉద్యమాలు చేసి వచ్చానన్నారు.. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ప్రవీణ్‌ కుమార్‌ ఫోన్‌ చేసి బెదిరించాలని చెప్పాడా..? ఇకనైనా ఫోన్ చేసి బెదిరింపులు బంద్‌ చేయండి.. జాతి పేరు ఆగం చేయకండి” అంటూ గట్టిగానే బదులిచ్చారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నావని.. పోలీసు స్టేషన్‌లో కేసు పెడతానని హెచ్చరించారు ఎమ్మెల్యే.. అయితే.. ఇప్పుడా ఆడియో వైరల్‌గా మారి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

Read Also….  Hyderabad Cinema: ఇక థియేటర్లలో ఐదు షోలు.. సినిమా ఎగ్జిబిటర్ల వినతిపై తెలంగాణ సర్కార్ సానుకూలం!