Crime News: సాయం చేయడానికి వచ్చి వృద్ధురాలిని చంపాడు.. బాలుడి ఘాతుకం.. అసలేమైందంటే..?
Juvenile Murder Woman: దేశ రాజధాని ఢిల్లీలో ఘరో సంఘటన చోటుచేసుకుంది. ప్రతిరోజూ కూరగాయలు తీసుకొచ్చే మైనర్.. 79 వృద్ధురాలిని కిరాతకంగా చంపాడు. రాయితో ఆమె తలపై
Juvenile Murder Woman: దేశ రాజధాని ఢిల్లీలో ఘరో సంఘటన చోటుచేసుకుంది. ప్రతిరోజూ కూరగాయలు తీసుకొచ్చే మైనర్.. 79 వృద్ధురాలిని కిరాతకంగా చంపాడు. రాయితో ఆమె తలపై కొట్టి హత్యచేశాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లోనున్న నగదు, ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో వెలుగు చూసింది. పోలీసులు మైనర్‌ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుసుమ్ సింఘాల్ (79) అనే వృద్ధురాలు రాజేంద్రనగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం కన్నుమూశాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలికి ఒక మైనర్ బాలుడు ప్రతిరోజూ కూరగాయలు తీసుకొని వచ్చి ఇచ్చేవాడు. ఆమెకు సాయంగా ఉంటున్న బాలుడు.. ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే శనివారం కూడా కూరగాయలు తీసుకొచ్చిన యువకుడు.. తలుపు తీయగానే వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. రాయితో కొట్టి ఆమెను దారుణంగా హత్యచేశాడు.
అనంతరం ఇంట్లోని విలువైన వస్తువులు, బంగారం, డబ్బును ఎత్తుకెళ్లాడు. కుమార్తె ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. వృద్ధురాలు ఫోన్ ఎత్తకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో వృద్ధురాలి కుమార్తె.. పొరుగింటివారికి ఫోన్ చేసి ఆరా తీయగా.. ఈ ఘోరం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ స్వేతా చౌహాన్ తెలిపారు.
ఎవరైనా బాలుడికి సహాయం చేశారా లేదా నేరం చేయడంలో ఏదైనా ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని డిసిపి చౌహాన్ చెప్పారు.
Also Read: