Gold Seized: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. ఎలక్ట్రానిక్ పరికరాల్లో తరలిస్తుండగా..
Gold seized in shamshabad airport: బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. అక్రమార్కులు పలు మార్గాల్లో బంగారాన్ని
Gold seized in shamshabad airport: బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అధికారులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. అక్రమార్కులు పలు మార్గాల్లో బంగారాన్ని ఇతర దేశాల నుంచి స్వదేశానికి తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. విదేశాల నుంచి వచ్చే కొందరు లో దుస్తుల్లో, సాక్సుల్లో, బూట్లల్లో, ఉదరం లోపల, కాప్సుల్స్ రూపంలో బంగారాన్ని తీసుకువస్తూ చిక్కుతున్నారు. తాజాగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
దుబాయి నుంచి FZ-439 విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 316.40 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ రూ.15.71లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఏసీ కన్వర్టర్‌లో దాచి ఉంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనుమానం వచ్చి ప్రయాణికుడిని తనిఖీలు చేయగా.. ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారం లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
On 13.12.21 Hyderabad Customs has booked a case of gold smuggling against a pax who arrived by Flight FZ-439 from Dubai. 316.40 grams of gold valued at Rs.15.71 lakhs, concealed in Voltage Up- Down AC Converter seized. @cbic_india @cgstcushyd @PIBHyderabad pic.twitter.com/D2l7CyKvXr
— Hyderabad Customs (@hydcus) December 13, 2021
Also Read: