AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITDA officer: ఆదివాసీలను పిలిచి నేలపై కూర్చోబెట్టిన అధికారి.. వివాదాస్పదంగా మారిన ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వ్యవహారశైలి

ఆడవి బిడ్డలకు అవమానం జరిగింది. ITDA లో ఆదివాసీ నాయకులను చర్చలకు పిలిచి మాజీ శాసన సభ్యురాలుతో సహా ఆదివాసీ నేతలను కటిక నేల మీద కూర్చోబెట్టాడు ఓ అధికారి.

ITDA officer: ఆదివాసీలను పిలిచి నేలపై కూర్చోబెట్టిన అధికారి.. వివాదాస్పదంగా మారిన ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వ్యవహారశైలి
Rampachodavaram Itda Project Officer's Behavior
Balaraju Goud
|

Updated on: Aug 24, 2021 | 9:08 AM

Share

ITDA Project officer’s behavior: ఆడవి బిడ్డలకు అవమానం జరిగింది. ITDA లో ఆదివాసీ నాయకులను చర్చలకు పిలిచి మాజీ శాసన సభ్యురాలుతో సహా ఆదివాసీ నేతలను కటిక నేల మీద కూర్చోబెట్టాడు ఓ అధికారి. ఆదివాసీల కోసం నడుస్తున్న ఐటీడీఏలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితో పాటు వచ్చిన ఆదివాసీ నేతలు కూర్చుకునేందుకు వీలు లేకుండా అవమానించాడు. చర్చలకు పిలిచిన ఐటీడీఏ ప్రాజెక్టు పీవో ప్రవీణ్‌ ఆదిత్య.. తమను నేలపైనే కూర్చోబెట్టి అవమానించారని ఆదివాసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వివాదాస్పదంగా మారింది ITDA ప్రాజెక్ట్‌ అధికారి ప్రవీణ్‌ ఆదిత్య వ్యవహారశైలి. ITDA లో ఆదివాసీ నాయకులను చర్చలకు పిలిచి..మాజీ ఎమ్మెల్యేతో సహా ఆదివాసీ నాయకులను నేల మీద కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చల పేరుతో తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల నిర్భంధం మధ్య చర్చలు జరిపారంటూ మండిపడుతున్నారు ఆదివాసీ నాయకులు. కనీసం మహిళా మాజీ ఎమ్మెల్యే అనికూడా చూడకుండా ఆయన కూర్చీలో కూర్చొని..తమను నేల మీద కూర్చొబెట్టారని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ప్రవీణ్ ఆదిత్య వ్యవహారం పై గతంలోనూ పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివాసీ హక్కులను గౌరవించాల్సిన ఐటీడీఏ అధికారే ఇలా తమన అవమానించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార దర్పంతో తమను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు కింద కూర్చునే తమ డిమాండ్లను ప్రాజెక్టు అధికారికి ఏకరువుపెట్టారు. ఈ డిమాండ్లకు పీవో నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నిరసనగా బయటకు వచ్చేశారు. అనంతరం వంతల రాజేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీలను కుర్చీల్లో కూర్చోబెట్టాలన్న సంస్కారం కూడా లేకుండా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్న పీవో ప్రవీణ్‌ ఆదిత్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా, ఆదివాసీ నాయకులను చర్చలకు పిలవగా.. మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి ముందుగా తనకు కేటాయించిన కూర్చీలో కూర్చున్నారని పీవో ప్రవీణ్‌ ఆదిత్య వివరించారు. ఆ తర్వాత ఆదివాసీ నాయకులు నా చాంబర్‌లోకి గుంపులుగా వచ్చారని వారందర్నీ కుర్చీల్లో కూర్చోమని కోరానని, అయితే పది కుర్చీలు మాత్రమే ఉండడంతో అవి తమకు చాలవంటూ మాజీ ఎమ్మెల్యే నేలపై కూర్చున్నారని దీంతో 15 నిమిషాలు నిలబడే వారితో చర్చించానని ప్రవీణ్‌ వివరణ ఇచ్చారు.

మరోవైపు, ప్రవీణ్‌ ఆదిత్య తీరుకు నిరసనగా ఆదివాసీ నేతలు సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదురు ఆందోళనకు దిగారు. దీంతో పీవో ఆదివాసీ నాయకులను చర్చలకు పిలిచారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పలువురు నాయకులు పీవో చాంబర్‌లోకి వెళ్లారు. అక్కడ సదరు అధికారికి తప్ప మాజీ ఎమ్మెల్యేకిగానీ, ఆదివాసీ నాయకులకు గానీ కుర్చీలు వేయలేదు.

Read Also…  Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో హై టెన్షన్‌.. ముష్కరమూకలు, భద్రతా బలగాల మద్య భీకర పోరు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

Real Me C21Y: అందుబాటు ధరలో అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన రియల్ మీ C21Y ఫోన్.. దీని ధర ఎంతంటే..