AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinnese loan App Scam: చైనీస్ లోన్‌ యాప్స్‌ కేసులో మరో కుట్ర కోణం.. ఈడీ ఎంట్రీతో బండారం బట్టబయలు!

చైనీస్ లోన్‌ యాప్స్‌ కేసులో మరో కుట్ర కోణం బయటపడింది. ఈడీ ఎంట్రీతో చైనీస్ ముఠా బండారం బట్టబయలైంది. ఇండియాకు ఒక్క పైసా కూడా బెనిఫిట్ జరగకుండా చైనీస్ కేటుగాళ్ల మోసం.

Chinnese loan App Scam: చైనీస్ లోన్‌ యాప్స్‌ కేసులో మరో కుట్ర కోణం.. ఈడీ ఎంట్రీతో బండారం బట్టబయలు!
Chinnese Loan App Scam
Balaraju Goud
|

Updated on: Sep 29, 2021 | 9:08 PM

Share

Instant loan app Scam: చైనీస్ లోన్‌ యాప్స్‌ కేసులో మరో కుట్ర కోణం బయటపడింది. ఈడీ ఎంట్రీతో చైనీస్ ముఠా బండారం బట్టబయలైంది. ఇండియాకు ఒక్క పైసా కూడా బెనిఫిట్ జరగకుండా చైనీస్ కేటుగాళ్లు చేసిన మోసాలు అన్ని ఇన్ని కావు. ఈడీ దర్యాప్తు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోన్‌ పేరుతో దేశంలో అడుగుపెట్టేందుకు చైనీలు ప్రయత్నాలు మొదలుపెట్టారన్న అనుమానాలను అధికారులు తేల్చే పనిలోపడ్డారు.

కాల్‌ మనీ..!  కాసుల కోసం కాటేసే నరరూప కాల్‌నాగులు గుర్తుకు వస్తారు.. అవసరం కోసం కాస్త రుణం తీసుకున్న పాపానికి… మహిళల పుస్తులు తెంపుకెళ్లారు. ఆ కాల్‌నాగులను మించిన.. చైనా లోన్‌ యాప్స్‌ నరరూప రాక్షసుల బరితెగింపులు వెలుగులోకి వచ్చాయి. చైనీస్ లోన్‌ యాప్స్‌ కేసులో ఈడీ ఎంట్రీతో.. కుట్ర కోణాలు బయటపడుతున్నాయి. మన దేశ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేలా.. చైనా కంపెనీలు ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. లోన్‌ యాప్స్‌తో భారత్‌పై.. చైనా చేస్తున్న ఆర్థిక కుట్రలేంటి?

చేసేది లోన్ బిజినెస్‌… అంతా ఫోన్లలోనే జరిగిపోతుంది… అందుకే ఎలాంటి అనుమతులు తీసుకోరు.. కానీ, వేలకోట్ల లావాదేవీలు చేస్తారు. ఈ డబ్బంతా భారత్‌దే. ఒక్క రూపాయి పెట్టుబడితో వందలు వేల రూపాయలు కొట్టేస్తారు. ఇలా కొట్టేసిన డబ్బును తెలివిగా దేశం దాటించేస్తారు. లోన్ యాప్స్ పేరుతో చైనీస్ ముఠా చేసిన కుట్ర ఇది. అయితే, ఈ కుట్రలో మరో కొత్త కుట్ర బయటపడింది.

వ్యాపారం భారత్‌లో… కానీ లాభాలు మాత్రం చైనాకు… అదీ కూడా అక్రమ మార్గంలో. సూక్ష్మంగా చైనీస్ లోన్ యాప్స్ ముఠా సాగించిన కుట్ర తీరు ఇది. ఇన్‌స్టెంట్ లోన్స్ పేరుతో వేలకోట్లు కొల్లగొట్టిన చైనీస్ ముఠాలు.. ఆ డబ్బును అక్రమ మార్గంలో చైనాకు తరలించాయి. మనీ లాండరింగ్‌కి సైతం దొరక్కుండా అత్యంత తెలివిగా దేశం దాటించేశాయి. వేలకోట్ల రూపాయలను భారత్‌ నుంచి చైనాకు మళ్లించిన మనీ యాప్స్‌ ముఠాలు… మనీ లాండరింగ్‌ నుంచి తప్పించుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. చైనా నుంచి విమానాల ద్వారా వస్తువులను దిగుమతి చేసుకున్నట్లు చూపించి. నకిలీ బిల్లులతో చైనాకు వేలకోట్లు తరలించింది.

ఈడీ ఎంట్రీతో చైనీస్ ముఠా కుట్ర బట్టబయలైంది. ఇప్పటివరకు 450కోట్ల రూపాయల విలువైన నకిలీ బిల్లులను ఈడీ అధికారులు గుర్తించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్.

Read Also….  World Heart Day 2021: ఈ లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలే.. వీటిని అశ్రద్ధ చేస్తే సమయం మించిపోవచ్చు!