Crime News: పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంది.. ప్రశ్నించినందుకు కత్తితో పొడిచింది.. చివరికి..
ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం.. ఇప్పుడు ప్రేమగా ఉన్న వ్యక్తులే తర్వాత శత్రువులుగా మారొచ్చు..
ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం.. ఇప్పుడు ప్రేమగా ఉన్న వ్యక్తులే తర్వాత శత్రువులుగా మారొచ్చు.. ఇలానే ఓ అమ్మాయికి కాలేజీకి వెళ్తున్నప్పుడు బస్సు కండక్టర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారి వివాహానికి ఇరువైపు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. ఓ చోట కాపురం పెట్టారు. వారికి పాప పుట్టింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల వారు వారిని దగ్గరకు తీసుకున్నారు. అప్పుడు మొదలైంది అసలు కథ..
తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి సమీపంలోని మాసయ్యన్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బాలమురుగన్ ప్రైవేట్ బస్సులో కండెక్టర్‌గా పని చేస్తున్నాడు. క్రిష్ణగిరి జిల్లాలోని పారిస్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇలాకియా ప్రైవేట్ కాలేజీలో చదువుకోవడానికి అదే బస్సులో వెళ్లేది ఈ క్రమంలో బాలమురుగన్ పరిచయం అయ్యాడు. కొంత కాలం వీరిద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లోని పెద్దలకు తెలిపారు. అయితే వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో బాలమురుగన్, ఇలాకియా పెద్దలను ఎదురించి 2020 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. బాల మురుగున్, ఇలాకియా దంపతులకు సంవత్సరం పాప జన్మించింది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు వారికి దగ్గరయ్యాయి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇలాకియా కొన్ని నెలల క్రితం తన భర్త నుండి విడిపోయి తన బిడ్డతో కృష్ణగిరిలోని తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. భర్త వేధింపులు భరించలేక మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలమురుగన్‌ను అరెస్ట్ చేశారు. అతను గత కొన్ని వారాల క్రితం జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చాడు.
జైలులో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాలమురుగన్‌తో అతని భార్య ఇలాకియా సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలోనే పెద్దలు కూడా రాజీ కుదిర్చారు. దీంతో ఇలాకియా భర్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంది. బిడ్డతో కలిసి వచ్చి.. భర్త ఇంటికి వచ్చింది. రాత్రి సమయల్లో ఇలాకియా ఫోన్‌లో మాట్లాడటం చూసిన బాలమురుగన్ ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఇలాకియా.. భర్తపై కత్తితో దాడి చేసింది. అతని ఛాతి భాగంలో పొడిచింది. బాలమురుగన్ అరుపులు విన్న అతని తల్లి జ్యోతి వెంటనే అక్కడికి చేరుకుంది. అయితే ఇలాకియా ఆమెను నెట్టివేయడంతో ఆమెకు కూడా గాయాలు అయ్యాయి. అతని అరుపులకు చుట్టుపక్కల వాళ్లు కూడా విని అక్కడికి చేరుకున్నారు. ఇలాకియా చర్యను అడ్డుకుని.. బాలమురుగన్‌ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడిని మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలమురుగన్‌కు అక్కడ చికిత్స కొనసాగుతోంది. బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎడప్పాడి పోలీసులు ఇలాకియాను అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి.. సేలం మహిళా జైలుకు తరలించారు.
Read Also… షాకింగ్ ఘటన.. ప్రయాణీకుల బస్సులో ఒక్కసారిగా మంటలు.. నడిరోడ్డుపై కాలిబూడిదైన ప్రభుత్వ బస్సు