Infant in Bush : పాపం పసికందు..! విశాఖ జిల్లా భోగాపురంలో అమానవీయ ఘటన

పాపం..! పొత్తిళ్ళలో ఉండాల్సిన ఆ పసికందు ముళ్ళపొదల్లో ఉంది. చల్లని గాలులు ఒక వైపు.. ఆగకుండా కురుస్తున్న

Infant in Bush : పాపం పసికందు..! విశాఖ జిల్లా భోగాపురంలో అమానవీయ ఘటన
Infant
Follow us

|

Updated on: Sep 03, 2021 | 11:10 AM

Infant in bush: పాపం..! పొత్తిళ్ళలో ఉండాల్సిన ఆ పసికందు ముళ్ళపొదల్లో ఉంది. చల్లని గాలులు ఒక వైపు.. ఆగకుండా కురుస్తున్న చినుకుకు మరోవైపు. చీమల దాడి.. ఆకలి..! పొదల్లో గుక్కపెట్టి ఏడుస్తున్న పాసికందు దయనీయ స్థితి. విశాఖ జిల్లా రోలుగుంట మండలం భోగాపురంలో జరిగిన ఈ అమానవీయ ఘటన చూసిన వారందరినీ కలచివేసింది. కంచుగుమ్మల శివారు భోగాపురం సమీపంలోని బీఎన్ రోడ్డులో అప్పుడే పుట్టిన పసికందును ముళ్ళపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్ళారు.

పసిబిడ్డ పొదల్లో ఉందన్న సమాచారం అందుకున్న ఎస్సై నాగకార్తీక్.. వెంటనే స్పందించి శిశువును స్వయంగా ఆసుపత్రికి తరలించారు. సపర్యలు చేశారు. ప్రస్తుతం ఆ శిశువు మహిళా శిశుసంక్షేమ శాఖాధికారుల ఆధీనంలో ఉంది. ఆడశిశువు కావడంతోనే వద్దనుకుని పొదల్లో విడిచివెళ్ళినట్టు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో స్పందించి శిశువును ఆసుపత్రికి చేర్చిన ఎస్సైని స్థానికులు అభినందించారు.

Read also: Siddharth Shukla: బాలీవుడ్ ఫేం సిద్ధార్ధ్ శుక్లా హఠాన్మరణంలో రహస్యాలేంటి.? ముందు రోజు రాత్రి అసలేం జరిగింది.?

Latest Articles