Siddharth Shukla: బాలీవుడ్ ఫేం సిద్ధార్ధ్ శుక్లా హఠాన్మరణంలో రహస్యాలేంటి.? ముందు రోజు రాత్రి అసలేం జరిగింది.?

బాలీవుడ్ బిగ్ బాస్ ఫేం సిద్ధార్ధ్ శుక్లా ఆకస్మిక మరణం వెనుక అసలేం జరిగింది. సిద్ధార్ధ్ శుక్లా మరణానికి ఓవర్ ఎక్సర్

Siddharth Shukla:  బాలీవుడ్ ఫేం సిద్ధార్ధ్ శుక్లా హఠాన్మరణంలో రహస్యాలేంటి.? ముందు రోజు రాత్రి అసలేం జరిగింది.?
Siddarth Sukla

Bollywood fame Siddharth Shukla: బాలీవుడ్ బిగ్ బాస్ ఫేం సిద్ధార్ధ్ శుక్లా ఆకస్మిక మరణం వెనుక అసలేం జరిగింది. సిద్ధార్ధ్ శుక్లా మరణానికి ఓవర్ ఎక్సర్ సైజులే కారణమా? డీహైడ్రేషన్ తోనే సిద్ధార్ధ్ చనిపోయాడా? ఇవే ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారాయి. వీటన్నింటికీ పోస్టుమార్టం రిపోర్టే ఆన్షర్. ఇంతకీ సిద్ధార్థ్ అటాస్పీ రిపోర్ట్ లో ఏం తేలింది? అనే అంశం మీద సర్వత్రా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

40ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా నిజంగానే హార్ట్ అటాక్ తో మరణించాడా? లేక సూసైడ్ చేసుకున్నాడా అనేది తేలాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు సిద్ధార్ధ్ గుండెపోటుతో మరణించాడని వైద్యులు ప్రకటించారు. అయితే, కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలు మాత్రం పోలీసుల్లో అనేక సందేహాలు రేపాయి. ఇంతకీ, శుక్లా ఫ్యామిలీ చెప్పిన సీక్రెట్స్ ఏంటి? శుక్లా మరణానికి ముందు రాత్రి అసలేం జరిగింది?

సిద్ధార్ధ్ నిద్రపోయే ముందు ఏవో టాబ్లెట్స్ వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిడ్ నైట్ మూడు గంటల సమయంలో గుండెలో ఇబ్బంది ఉందని చెప్పడంతో మంచినీళ్లు ఇచ్చినట్లు శుక్లా తల్లి తెలిపింది. ఆ తర్వాత మళ్లీ నిద్రలోకి వెళ్లిపోయాడు శుక్లా. కానీ, శుక్లా, ఎప్పటిలాగా నిద్ర లేవలేదు. తల్లి వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడివున్నాడు. ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో ఉదయం 10గంటల సమయంలో కూపర్ ఆస్పత్రికి తరలించారు. తీసుకెళ్లిన కాసేపటికే శుక్లా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇక్కడే అందరికీ అనుమానాలు కలుగుతున్నాయ్. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునే శుక్లా… డైలీ వర్కవుట్స్, ఎక్సర్ సైజెస్ తో బాడీని ఫుల్ ఫిట్ గా ఉంచుకుంటాడు. పైగా చిన్న వయసు. నలభై కూడా దాటలేదు. మరి హార్ట్ అటాక్ రావడమేంటి? అంత సడన్ గా ఎలా చనిపోయాడు? ఇలాంటి సందేహాలే అతని ఫ్యాన్స్ తోపాటు అందరిలో రేగుతున్నాయ్.

సిద్ధార్ధ్ మరణంపై అతని అభిమానులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సుశాంత్ తర్వాత ఇది ఇంకో మర్డర్ అంటున్నారు. సుశాంత్ ను అనుమానాస్పదంగా చంపేసినట్లే… శుక్లాను కూడా పైకి పంపేశారని అంటున్నారు. అప్పుడు సుశాంత్ ను… ఇప్పుడు శుక్లాను కూపర్ ఆస్పత్రికే తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. హత్య కాకపోతే కూపర్ ఆస్పత్రికే శుక్లాను ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు.

ఫ్యాన్స్ డౌట్స్ పక్కనబెడితే… సుశాంత్, శుక్లా డెత్స్ మధ్య పోలికలు మాత్రం కనిపిస్తున్నాయి. సుశాంత్ మృతికి ముందు రోజు డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయ్. ఇప్పుడు శుక్లా కూడా అదే తరహాలో టాబ్లెట్స్ వేసుకున్నాకే మరణించాడు. ఇద్దరి మరణాలు ఉదయం 10గంటల సమయంలోనే బయటికి తెలిసింది. ఇద్దరినీ చివరి క్షణాల్లో తీసుకెళ్లిందీ ఒకే హాస్పిటల్ కి. అదే కూపర్ ఆస్పత్రి. ఇద్దరూ హెవీ వర్కవుట్స్, ఎక్సర్ సైజులు చేసేవాళ్లే. ప్రతిరోజూ నాలుగైదు గంటలు జిమ్ లోనే గడిపేవారు. ఇద్దరూ తమ కెరీర్స్ పీక్ లో ఉండగానే అనుమానాస్పదంగా చనిపోయారు.

ఇంతకీ, సిద్ధార్థ్ మృతికి కారణమేంటి? డ్రగ్స్ తీసుకోవడంతో మరణించాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? సుశాంత్ మాదిరిగానే శుక్లా కూడా హెవీ డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్స్ లో తేలింది. దాంతో, ఒత్తిడి నుంచి బయటపడటానికి సిద్ధార్ధ్ డ్రగ్స్ తీసుకునేవాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

సుశాంత్ సింగ్ మిస్టరీ డెత్ తర్వాత తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసులో సిద్ధార్థ్ శుక్లా పేరు కూడా వినిపించింది. దాంతో, డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవడం వల్లే శుక్లా మరణించాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, అసలు నిజాలు తెలియాలంటే శుక్లా అటాస్పీ రిపోర్ట్ రావాల్సిందే. అప్పుడే గుండెపోటుతో మరణించాడా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తేలనుంది. అయితే, సుశాంత్ ఎలా చనిపోయాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మరి, శుక్లా డెత్ కూడా అలాగే మిగిలిపోనుందా? లేక మిస్టరీ వీడిపోతుందో లేదో చూడాలి.

సిద్ధార్థ్ శుక్లా శరీరంపై ఎలాంటి గాయాల్లేవని ముంబై పోలీసులు చెబుతున్నారు. అయితే, గుండెపోటుతో చనిపోయాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అటాస్పీ రిపోర్ట్ వచ్చాకే ఎలా చనిపోయాడనేది తెలుస్తుందని ముంబై డీసీపీ వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఎవరిపైనా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

Read also:

Click on your DTH Provider to Add TV9 Telugu