AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పబ్‌జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలు చేసిన వైనం!

స్మార్ట్‌ ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌కు ఈకాలం యువత బానిసలు అవుతున్నారు. ఒకవేళ వారిని ఆట నుంచి దూరం చేస్తే ఉన్మాదులుగా మారి హత్యలు చేసేవరకు వెళ్ళుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒక కర్ణాటకలో జరిగింది. పబ్‌జీ గేమ్ ఆడుతుంటే అడ్డుకున్నారని కన్నతండ్రినే కత్తిపీటతో ముక్కలుగా నరికి హతమార్చాడు. ఈ ఘోరం కర్ణాటకలో బెళగావి తాలుకాలోని కాకతీ కాలనీలో సోమవారం జరిగింది. హతుడు శంకరప్ప కమ్మార(60) కాగా, నిందితుడు అతని కుమారుడు రఘువీర్‌ కమ్మార (25). ఐటీఐ మెకానికల్‌ రెండో […]

పబ్‌జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలు చేసిన వైనం!
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 11, 2019 | 10:25 AM

Share

స్మార్ట్‌ ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌కు ఈకాలం యువత బానిసలు అవుతున్నారు. ఒకవేళ వారిని ఆట నుంచి దూరం చేస్తే ఉన్మాదులుగా మారి హత్యలు చేసేవరకు వెళ్ళుతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒక కర్ణాటకలో జరిగింది. పబ్‌జీ గేమ్ ఆడుతుంటే అడ్డుకున్నారని కన్నతండ్రినే కత్తిపీటతో ముక్కలుగా నరికి హతమార్చాడు. ఈ ఘోరం కర్ణాటకలో బెళగావి తాలుకాలోని కాకతీ కాలనీలో సోమవారం జరిగింది. హతుడు శంకరప్ప కమ్మార(60) కాగా, నిందితుడు అతని కుమారుడు రఘువీర్‌ కమ్మార (25). ఐటీఐ మెకానికల్‌ రెండో ఏడాది చదువుతున్న రఘువీర్‌ మొబైల్‌లో హింసను ప్రేరేపించే గేమ్స్‌కి బాగా అలవాటు పడ్డాడు. ఇక దానితో విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇక ఆ పిచ్చి బాగా ముదిరిపోయి శనివారం అర్ధరాత్రి రఘవీర్ అటు ఇంట్లోనూ, వీధిలో ఇతరుల ఇంటికి వెళ్లి తలుపులు, కిటికీలు కొడుతూ తనకు రక్తం కావాలని వికృత చేష్టలు చేయడంతో స్థానికులు పోలీసులకు అప్పగించారు. వారి ఫిర్యాదుతో ఆదివారం తల్లిదండ్రులతో పాటు అతన్ని పోలీసులు పిలిపించి హెచ్చరించారు.

ఆదివారం అర్ధరాత్రి దాటేవరకు రఘువీర్ మొబైల్‌లో పబ్‌జీ ఆడుతుండగా.. అతని చేతికి రక్తం కారడం గమనించిన తల్లి ..చేతికి కట్టు కట్టబోయింది. దీంతో రఘువీర్.. ఆడుతుండగా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్ అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇదంతా గమనిస్తున్న తండ్రి రఘువీర్ చేతిని గట్టిగా పట్టుకుని కట్టు కట్టమని భార్యకు చెప్పగా.. అతడిలోని ఉన్మాది నిద్ర లేచాడు. తల్లిని మరో గదిలోకి నెట్టి గడియపెట్టి తన చేతికి ఉన్న బ్యాండేజ్‌ మొత్తం విప్పి తండ్రి గొంతుకు చుట్టి హత్య చేయబోయాడు, పక్కనే ఉన్న కత్తిపీట తీసుకుని తండ్రిపైన దాడి చేయగా.. అతడు ప్రాణాలు విడిచాడు. ఈ ఉన్మాది అంతటితో ఆగకుండా తండ్రి మొండాన్ని, తలను వేర్వేరుగా నరికేశాడు. రఘువీర్ ఇంట్లో నుంచి వస్తున్న అరుపులను గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోనికి వచ్చే ప్రయత్నం చేయగా వారిపై కూడా కత్తిపీటతో దాడికి యత్నించాడు. సుమారు అరగంట పాటు అలా ముప్పతిప్పలు పెట్టాడు. పోలీసులు ఒక బెడ్‌షీటు తీసి అతని పైన వేసి గట్టిగా పట్టుకొని బంధించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఆన్లైన్‌ గేమ్స్‌తో ఉన్మాద ఛాయలు…

ఆన్లైన్ ద్వారా ఈ కాలం యువత మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న ఎన్నో గేమ్స్ వారిలోని పైశాచికత్వాన్ని నిద్ర లేపుతున్నాయి. ఓన్లీ ఫర్ ఎంజాయ్‌మెంట్ అని వాటిని రూపొందించే నిర్వాహకులు అంటున్నా.. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వల్ల యువత వ్యసనాలకు లోబడి తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక పబ్‌జీ విషయానికి వస్తే.. ఈ ఆటకు యువత బానిస అయిపోయారు. చూడడానికి సింపుల్‌గా ఉన్నా.. ఈ గేమ్ వల్ల చాలామంది ఉన్మాదులుగా మారిపోతున్నారు. డాక్టర్స్, నిపుణులు కూడా ఆన్లైన్ గేమ్స్‌కు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి హింసాత్మక ఆటలను నిషేధిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.