Hyderabad: నడిరోడ్డుపై మలవిసర్జన.. ప్రశ్నించిన పాపానికి తిట్ల దండకం.. సెల్‌ఫోన్ లాక్కొని హోంగార్డుపై దాడికి యత్నం!
హైదరాబాద్ పాతబస్తీలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. రోడ్డుపైనే వీరంగం సృష్టించారు. ఇదేం పని అని అడిగిన పాపానికి ఓ పోలీసు హోంగార్డుపై దాడికి యత్నించారు.
హైదరాబాద్ పాతబస్తీలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. రోడ్డుపైనే వీరంగం సృష్టించారు. ఇదేం పని అని అడిగిన పాపానికి ఓ పోలీసు హోంగార్డుపై దాడికి యత్నించారు. పాతబస్తీలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు ట్రాఫిక్ హోంగార్డుపై అసభ్యకరమైన పదజాలాలతో దూషించడమే కాకుండా అతనిపై ధాడికి యత్నించారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ హోంగార్డు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిథిలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఫిసల్‌బండా జంక్షన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా బాలాపూర్ నుండి ఐదు మంది యువకులు వచ్చి ఆటోను రోడ్డుపై పార్క్ చేసి ముత్రవిసర్జనలు చేస్తుండగా హోంగార్డు అడిగినందుకు అతని అసభ్యకరమైన పదజాలలతో దూషిస్తూ దాడికి యత్నంంచారు. ఫోటోలు తీసేందుకు ప్రయత్నించిన హోంగార్డు సెల్‌ఫోన్ లాక్కోనేందు ప్రయత్నించారు. ఆటోలో ఉన్న ఇద్దరు సంతోష్, రాజేష్ పీకలదాక మద్యం సేవించి రోడ్డుపై విరంగం సృష్టించడంతో విషయం తెలుసుకున్న సంతోష్ నగర్ పీఎస్ పెట్రోలింగ్ సంబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సంతోష్ ను అదుపులోకి తీసుకోగా రాజేష్ పరారయ్యాడు. హోంగార్డు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసిన సంతోష్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also.. Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..