Krishna District: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు
Krishna District: కృష్ణ జిల్లాలో భార్యను గొడ్డలితో నరికి చంపిన కిరాతక భర్త ను నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తిరువూరు మండలం..
Krishna District: కృష్ణ జిల్లాలో భార్యను గొడ్డలితో నరికి చంపిన కిరాతక భర్త ను నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తిరువూరు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన వెన్నం సత్యనారాయణరెడ్డి కిరాతకంగా తన భార్య పద్మావతి ని గొడ్డలితో నరికి చంపేశాడు. గొడ్డలి, రక్తం మరకలతో గంపలగూడెం,రుద్రవరం, రంగాపురం మీదుగా హంతకుడు వెన్నం సత్యనారాయణ రెడ్డి బైక్ పై నూజివీడు చేరుకున్నాడు. అయితే నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసులు రక్తం మరకలతో ఉన్న సత్యనారాయణ రెడ్డి చూసి అదుపులోకి తీసుకున్నారు.
కాగా, తిరువూరు పోలీసులకు హంతకుడిని నిందితుడిని అప్పగించనున్నారు. మృతురాలికి ఇద్దరూ కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం సత్యనారాయణ రెడ్డి, పద్మావతి దంపతులు తిరువూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, కొందరు పోలీసు సిబ్బంది తననే దూషించి తన భార్య పట్ల సానుభూతి వ్యక్తం చేశారని, అక్కడ లొంగిపోయినట్లయితే తనపై దాడి చేస్తారేమోనని భయంతో నూజివీడు పోలీసులకు లొంగిపోయేoదుకు వస్తున్నట్లు హంతకుడు సత్యనారాయణ రెడ్డి చెప్పడం కొసమెరుపు.