AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నీ గ‌దిలో ఏసీ లేదుగా.. నా రూమ్‌కు వ‌చ్చేయ్‌’.. నెల్లూరు జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినిప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌..

Phone Harassment Nellore: చ‌దువు చెప్పాల్సిన గురువులే విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్యంగా మాట్లాడితే. మంచి చెడులు చూడాల్సిన అధికారులే చ‌దువుకుంటోన్న అమ్మాయిల‌ను లోబ‌రుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే.. నెల్లూరు జీజీహెచ్‌లో...

'నీ గ‌దిలో ఏసీ లేదుగా.. నా రూమ్‌కు వ‌చ్చేయ్‌'.. నెల్లూరు జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినిప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌..
Phone Harassment In Nellore
Narender Vaitla
|

Updated on: Jun 04, 2021 | 7:09 AM

Share

Phone Harassment Nellore: చ‌దువు చెప్పాల్సిన గురువులే విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్యంగా మాట్లాడితే. మంచి చెడులు చూడాల్సిన అధికారులే చ‌దువుకుంటోన్న అమ్మాయిల‌ను లోబ‌రుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే.. నెల్లూరు జీజీహెచ్‌లో ఇలాంటి సంఘ‌ట‌న చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ అధ్యాప‌కుడు విద్యార్థిని ప‌ట్ల ప్ర‌వ‌ర్తిచిన తీరు స‌భ్య‌స‌మాజాన్ని ప్ర‌శ్నిస్తోంది. తాను ఉన్న స్థానాన్ని సైతం మ‌రిచి వైద్య విద్యార్థినిపై క‌న్నేశాడు ఓ ప్ర‌బుద్ధుడు. తాజాగా గురువారం ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ కామందుడి బాధ‌ను బ‌రించ‌లేని విద్యార్థిని త‌న ఆవేద‌ను ఇలా చెప్పుకొచ్చింది. ‘నా వయస్సు 23 ఏళ్లు.. నాకు తెలిసి మీ పిల్లలకూ ఇదే వయస్సు ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా.. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నా… ఎందుకు ఫోన్‌ చేస్తున్నారు? నువ్వు నా సోల్‌మేట్‌.. లైఫ్‌ పార్ట్‌నర్‌.. వైజాగ్‌ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏమిటి సార్‌? రెస్టారెంట్లు, బీచ్‌కు రావాలని అడుగుతారా? నీ రూమ్‌లో ఏసీ లేదుగా.. నా రూముకు రా అని ఎలా పిలుస్తారు? ఏం మాటలవి సార్‌.. నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నారా? మీ నంబరును బ్లాక్‌ చేస్తే.. మరో నంబరు నుంచి ఫోన్‌ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మానసికంగా వేధించడం వల్ల కొన్ని నెలలుగా పుస్తకాలు తెరవలేదు. విధులు నిర్వహించినా.. సంతకం పెట్టలేదు.. సార్‌’ అంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిందా యువ‌తి. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విష‌యాన్నిసీరియ‌స్‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే నెల్లూరు జీజీహెచ్‌లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు.. గ‌తంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. రెండేళ్ల కిందట ఓ వైద్య విద్యార్థినితో ఓ అధ్యాపకుడు అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగుచూడటంతో ఆమె కుటుంబసభ్యులు ఆయనపై దాడి చేశారు. దీంతో అధ్యాపకుడిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించి.. విచారణ కమిటీ వేసింది. అప్ప‌ట్లో ఈ వార్త తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read: అదనపు కట్నం దాహానికి బలైన మహిళ.. కొట్టి చంపి కరోనా చనిపోయిందంటున్నారంటూ..

కసాయి తల్లిః ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది.. సహజీవనానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కూతుర్ని చంపేసింది..

Murder: సలాడ్ లేటయ్యిందని భార్యను చంపిన భర్త.. కుమారుడిపై కూడా కొడవలితో దాడి..