Telangana: మా బంధువుల శుభకార్యాలకు ఎందుకు రావు.. వీడియో కాల్ లో భర్త ఆవేదన.. చివరకు ఊహించని ట్విస్ట్
వివాహ బంధం ఎంతో సున్నితమైనది. చిన్న చిన్న అలకలు, సరదాలు, గొడవలు సాధారణమే. అయితే అవి కూడా ఓ లిమిట్ వరకు మాత్రమే. ఆ లిమిట్ క్రాస్ చేశాయంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పెళ్లి తర్వాత భర్త, భార్య...
వివాహ బంధం ఎంతో సున్నితమైనది. చిన్న చిన్న అలకలు, సరదాలు, గొడవలు సాధారణమే. అయితే అవి కూడా ఓ లిమిట్ వరకు మాత్రమే. ఆ లిమిట్ క్రాస్ చేశాయంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పెళ్లి తర్వాత భర్త, భార్య తరఫు బంధువులు ముఖ్యమే. అంతే గానీ భార్య తరఫు బంధువులే ముఖ్యమని, భర్త తరఫు బంధువులే ముఖ్యమని ఘర్షణలకు దిగొద్దు. ఇలాంటి మనస్పర్థలు తీవ్ర విపత్పరిణామాలకు దారి తీస్తాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. భార్య తీరుతో విసిగిపోయిన భర్త వీడియో కాల్ మాట్లాడుతూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుక్కుగూడలో నివాసుమండే ఉండే సాయి కార్తిక్‌గౌడ్.. తన భార్యతో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు వెళ్లాడు. కందుకూరు మండలం బేగంపేటకు భార్యతో కలిసి హాజరయ్యాడు. శుభకార్యం ముగిసిన తర్వాత పుట్టింటివాళ్లు కావడంతో భార్య అక్కడే ఉండిపోయింది. కార్తిక్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కార్తిక్ పిన్ని నివాసముండే మీర్‌పేటలో ఆదివారం బోనాలు పండుగ జరుపుకున్నారు. ఈ క్రమంలో కార్తిక్ గౌడ్ తన భార్యకు ఫోన్ చేసి తన పిన్ని ఇంటికి వెళ్లాలని కోరాడు. దీనిపై భార్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంతో కార్తిక్ మనస్తాపానికి గురయ్యాడు.
భార్యకు వీడియో కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. మీ వాళ్ల ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర విందులకు నేను హాజరవుతున్నా కదా.. మా వాళ్ల వద్దకు నీవెందుకు రావంటూ ప్రశ్నించాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ దూలానికి ఉరేసుకున్నాడు. అప్పటివరకు వీడియో కాల్ లో మాట్లాడిన భర్త దూలానికి ఉరివేసుకుంటున్న సమయంలో ఫోన్ ను కింద పడేశారు. ఊహించని హఠాత్పరిణామానికి భార్య తీవ్ర ఆందోళన చెందింది. వెంటనే భర్త వద్దకు బయలుదేరింది. తన భర్తను కాపాడాలంటూ చుట్టుపక్కలా ఉన్న వారికి ఫోన్లు చేసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇంటికి చేరుకునేప్పటికే భర్త మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి