AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నీరులేని చెరువులో రహస్యంగా ముగ్గురు మహిళల తవ్వకాలు.. అనుమానంతో పోలీసులు చెక్ చేయగా

కేటుగాళ్లు మహిళలను కూడా దందాలోకి లాగుతున్నారు. డబ్బు ఎరగా చూపి వారిని ఈ రొంపిలోకి దించుతున్నారు. వారిపై పోలీసుల ఫోకస్ ఎక్కువ ఉండదని ఈ మార్గానికి తెరలేపారు.

Viral: నీరులేని చెరువులో రహస్యంగా ముగ్గురు మహిళల తవ్వకాలు.. అనుమానంతో పోలీసులు చెక్ చేయగా
Crime News
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2022 | 1:36 PM

Share

Tamil Nadu: గంజాయి పెను ముప్పుగా మారుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి పెంపకంతో పాటు అమ్మకాలు జరగుతున్నాయి. ఈ క్రమంలోని యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించాలని.. అక్రమార్కలపై ఉక్కుపాదం మోపాలని.. అంతేకాకుండా డ్రగ్స్ ప్రభావంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(CM MK Stalin) కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అలెర్టయ్యారు. విసృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుచ్చి జిల్లా(Trichy District)లో గంజాయి నిర్మూలన చేసేందుకు పోలీసులు స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. జీయపురం సరాగ్ డీఎస్పీ పరవాసుదేవన్ నేతృత్వంలో ఇన్ స్పెక్టర్ వీరమణి సహా 50 మందికి పైగా పోలీసులు జీయపురం సరాగ్ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోని ఓ ముగ్గురు మహిళా గంజాయి విక్రేతల గురించి సమాచారం అందింది. వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఊహించని విధంగా వారు ఓ నీరులేని చెరువు వద్దకు వెళ్లారు. ఎవరైనా వచ్చి ఆ మహిళలకు గంజాయి ఇస్తారేమో అని పోలీసులు అనుకున్నారు. కానీ వారు అక్కడ మట్టిని తవ్వుతుండగా.. పోలీసులు క్లారిటీ వచ్చేసింది. దీంతో మెరుపు దాడి చేశారు. అక్కడ తవ్వకాలు జరిపి భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా గంజాయి తమిళనాడుకు స్మగ్లింగ్ అవుతుందని, తిరుచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలోని విద్యార్థులకు వీరు గంజాయి అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..