Honey Trap: ఏపీలో హాని ట్రాపింగ్ కలకలం.. అల్లరి పిల్ల మాయలో పడి..

Honey trapping case: ఆంధ్రప్రదేశ్‌లో హాని ట్రాపింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఫేస్‌బుక్ ద్వారా ఫోన్‌లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును మాయం చేస్తున్న కిలాడీ ముఠాను

Honey Trap: ఏపీలో హాని ట్రాపింగ్ కలకలం.. అల్లరి పిల్ల మాయలో పడి..
Honey Trap
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 08, 2022 | 3:44 PM

Honey trapping case: ఆంధ్రప్రదేశ్‌లో హాని ట్రాపింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఫేస్‌బుక్ ద్వారా ఫోన్‌లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును మాయం చేస్తున్న కిలాడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన చిత్తూరు (Chittoor) జిల్లాలో చోటుచేసుకుంది. హాని ట్రాపింగ్‌కు పాల్పడిన 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులంతా ఫేస్‌బుక్ ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును మాయం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్లరి పిల్ల అనే ఫేస్ బుక్ ప్రొఫైల్‌తో పలువురికి వల వేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట అల్లరి పిల్ల ఐడీ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి.. ముఠా బాధితులతో పరిచయం పెంచుకుంటుంది.

ఆ తర్వాత ఫేస్‌బుక్ మెస్సెంజర్ ద్వారా చాటింగ్ చేసి.. యువతుల ద్వారా వీడియో కాల్స్ చేయిస్తారు. అయితే.. వీడియో కాల్స్ మాట్లాడడానికి ఐఎంఓ అప్లికేషన్ ఇన్ స్థాల్ చేసుకోమని ఒత్తిడి చేస్తారు. అలా ఐఎంఓ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసిన బాధితులతో యువతులు మాట్లాడినట్లు మాయ చేస్తారు. అనంతరం ఐయంఓ లిటిల్ అప్లికేషన్ ద్వారా మొబైల్ హ్యాక్ చేస్తారు. ఇలా చిత్తూరులో సీకే మౌనిక్ అనే యువకుడి బ్యాంక్ ఖాతా నుండి నుంచి దాదాపు 4 లక్షల రూపాయలు కాజేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు విశాఖపట్నం, వరంగల్, కడప జిల్లాలకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Russia Ukraine Crisis: ఎక్కడికి పారిపోలేదు.. కావాలంటే వీడియో చూసుకోండి.. రష్యాకు సవాల్ విసిరిన జెలెన్‌స్కీ

Health Tips for Women: పీరియడ్స్ సమయంలో ఈ సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..