Shocking: ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా మహిళ.. డాక్టర్లు వద్దకు తీసుకెళ్లి స్కానింగ్.. రిపోర్ట్ చూసి మైండ్ బ్లాంక్
మన దేశంలో 800 మిలియన్ల జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసువారే. వారే భారత్‌కు ఆస్తి. ఈ క్రమంలోనే యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాల నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫోకస్ పెట్టాయి.
Heroin in Women Body: డ్రగ్స్ రవాణా ఆగడం లేదు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు ఇండియాకు చేరుతున్నాయి. డ్రగ్స్‌ను మన దేశానికి తరలించేందుకు స్మగ్లర్స్ చేస్తున్న ప్రయత్నాలు పోలీసులను, అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇండియా.. డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ దేశంలోనూ లేనంత యువత మన దేశంలో ఉన్నారు. మన దేశంలో 800 మిలియన్ల జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసువారే. వారే భారత్‌కు ఆస్తి. ఈ క్రమంలోనే యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాల నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫోకస్ పెట్టాయి. డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద మరింత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా శరీరంలో క్యాప్సుల్స్ రూపంలో హెరాయిన్‌ను తరలించేందుకు యత్నించిన ఓ మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.6 కోట్లు విలువ చేసే 862 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్ ఎయిర్‌పోర్ట్‌లో గతనెల 19న జరిగింది. సూడాన్‌కు చెందిన ఈ నిందితురాలి నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు 12 రోజులు పట్టింది. ఎందుకంటే ఆమె శరీరంలో మొత్తం 88 క్యాప్సుల్స్ దాచుకుని ఇక్కడకు వచ్చింది.
నిందితురాలికి స్కానింగ్ నిర్వహించగా.. వచ్చిన రిపోర్ట్ చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. కొన్ని క్సాప్సుల్స్ ఆమె కడుపులో మరికొన్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో దాచినట్లు గుర్తించారు. మేజిస్ట్రేట్ నుంచి అనుమతులు వచ్చిన అనంతరం.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 మధ్య డాక్టర్లు వీటిని వెలికి తీశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి నిందితురాలుకు 14 రోజుల రిమాండ్ విధించారు.
Also Read: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..
టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..