భూతంలా మారిన ఇంగ్లీష్ మీడియం చదువులు.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఎంత పని చేశాడంటే..
తల్లిలేని బిడ్డ అని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. కుమారుడు మంచి గా చదువుతుండటంతో ట్రిపుల్ ఐటీలో చేర్పించాడు. ఈ మధ్యే సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి మళ్లీ కళాశాలకు వెళ్లాడు...
తల్లిలేని బిడ్డ అని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. కుమారుడు మంచి గా చదువుతుండటంతో ట్రిపుల్ ఐటీలో చేర్పించాడు. ఈ మధ్యే సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి మళ్లీ కళాశాలకు వెళ్లాడు. ఏం జరిగిందో ఏమో.. వసతి గృహంలోని గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి, సోదరి విలపించిన తీరు కంటతడి పెట్టించింది. విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగి గ్రామానికి చెందిన రాము.. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో(IIIT Nuziveedu) చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాము వసతిగృహంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న రాము తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న అప్పన్నకు ఇద్దరు పిల్లలు. భార్య ఆరేళ్ల క్రితం మృతి చెందింది.
అన్నీ తానై బిడ్డలను చూసుకుంటున్నాడు. కుమార్తె గ్రామంలో వాలంటీరుగా పని చేస్తోంది. రాము బాగా చదువుతుండటంతో.. అతనికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష రాయించారు. ఆ పరీక్షలో రాము ఉత్తీర్ణుడవడంతో సీటు వచ్చింది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన రాము ఆంగ్ల మాధ్యమంలో చదవడం కష్టంగా ఉందని చెప్పి బాధపడడంతో గ్రామంలో చదివిన ఉపాధ్యాయుల వద్దకు తీసుకెళ్లి ధైర్యం చెప్పించి పంపించానని తండ్రి అన్నాడు. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడ్డాడని అప్పన్న తీవ్రంగా విలపించాడు.
(చదువులు విజ్ఞానం కోసమే.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని విద్యార్థులు గ్రహించాలి. మానసిక ఒత్తిడి, క్రుంగుబాటు సమస్యలకు మానసిక వైద్య నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలని టీవీ9 సూచిస్తుంది)
Also Read
Kriti Sanon: చీర కట్టు అందాలతో కేక పెట్టిస్తోన్న కృతి సనన్ లేటెస్ట్ ఫోటోస్
Fact Check: యుద్ధరంగంలోకి ఉక్రెయిన్ తొలి మహిళ.. అసలు నిజం ఇదేనా..!