Constable Suicide: కడప డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలో విషాదం.. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..!

కడప జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తానూ పనిచేస్తున్న ప్రాంతంలోనే ప్రాణాలొదిలారు.

Constable Suicide: కడప డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలో విషాదం.. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..!
Police Head Constable Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 21, 2021 | 1:50 PM

Kadapa Head Constable Suicide: కడప జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తానూ పనిచేస్తున్న ప్రాంతంలోనే ప్రాణాలొదిలారు. కడప డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్‌లో ఎవరు లేని సమయంలో ఈ ఘటనకు ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. తోటి ఉద్యోగులు వచ్చి చూసేసరికి విగతజీవిగా మారిన కానిస్టేబుల్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం కడప జీజీహెచ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also….  Politics: సీఎం తనయుడి ఫోటో రచ్చ.. అలా ఎలా పెడతారంటూ భగ్గుమంటున్న విపక్ష నేతలు..

Hyderabad: హైదరాబాద్‌లో హైటెక్ కాపీయింగ్.. సీసీ కెమెరాలో చిక్కిన షాకింగ్ విజువల్స్.. చివరికి ఏం జరిగిందంటే..