Hyderabad: హైదరాబాద్‌లో హైటెక్ కాపీయింగ్.. సీసీ కెమెరాలో చిక్కిన షాకింగ్ విజువల్స్.. చివరికి ఏం జరిగిందంటే..
High tech Mass: హైదరాబాద్‌లో హైటెక్ తరహా మాస్ కాపియంట్ కలకలం రేపుతోంది. వాయుసేన ఎయిర్‌మెన్ ఆన్‌లైన్ పరీక్షలో హైటెక్ తరహా కాపీకి
Hyderabad: హైదరాబాద్‌లో హైటెక్ తరహా కాపియంగ్ కలకలం రేపుతోంది. వాయుసేన ఎయిర్‌మెన్ ఆన్‌లైన్ పరీక్షలో హైటెక్ తరహా కాపీకి పాల్పడుతూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. హర్యానాకు చెందిన సౌరభ్ అనే యువకుడు సరూర్‌నగర్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌లో గల ఎస్‌ఈజెడ్ పరీక్షా సెంటర్‌లో ఎగ్జామ్ రాసేందుకు వచ్చాడు. ఎవరికీ కనిపించకుండా చెవికి రిసీవర్, బనియన్‌కు ఎలక్ట్రానిక్ డివైస్ అమర్చుకున్నాడు. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో పరీక్ష రాసేందుకు ప్రయత్నించాడు.
అయితే సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్న పరీక్షా కేంద్రం సిబ్బందికి.. సౌరభ్ కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దాంతో ఇన్విజిలేటర్లు అతన్ని చెక్ చేశారు. చెవికి రిసీవర్ , బనియన్‌కు ఎలక్ట్రానిక్ డివైస్ అమర్చి ఎగ్జామ్స్ రాస్తున్న విషయాన్ని గమనించి రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నారు. హర్యాణా నుంచి మిత్రుల సహాకారంతో సౌరభ్ పరీక్ష రాస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. అధికారులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
Also read:
Weight loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా?.. అయితే మీ డైట్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..