AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా?.. అయితే మీ డైట్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..

Weight loss: ఎవరైనా సరే తమ శరీర బరువును తగ్గించుకునే క్రమంలో డైట్ ప్లాన్ చేసుకుంటారు. ఆ డైట్‌లో ముఖ్యంగా పిండి పదార్థాలు లేని..

Weight loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా?.. అయితే మీ డైట్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..
Healthy Carbs
Shiva Prajapati
|

Updated on: Jul 21, 2021 | 12:03 PM

Share

Weight loss: ఎవరైనా సరే తమ శరీర బరువును తగ్గించుకునే క్రమంలో డైట్ ప్లాన్ చేసుకుంటారు. ఆ డైట్‌లో ముఖ్యంగా పిండి పదార్థాలు లేని ఆహారాన్ని ఎంపిక చేసుకుంటారు. అయితే, అలా చేయడం తప్పని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి పిండిపదార్థాలు లేని ఆహారం తీసుకోవడం మంచిది కాదంటున్నారు. మితంగానైనా పండి పదార్థాలు కలిగిన ఆహారం శరీరానికి అందించాలంటున్నారు. వాస్తవానికి మనం ఏదైనా శారీరక శ్రమ చేయడానికి పిండి పదార్థాలు చాలా అవసరం. అందుకే పిండిపదార్థాలు కలిగిన ఆహారాన్ని పూర్తిగా దూరం చేయకుడదంటున్నారు. బరువును తగ్గించుకునేందుకు, అదే సమయంలో శరీరానికి పోషకాలు అందించేందుకు ఆరోగ్యకరమైన పిండి పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు.

శరీరానికి పిండిపదర్థాలు ఎందుకు అవసరం.. శరీరానికి శక్తినందించే వాటిలో కార్పోహైడ్రేట్స్ చాలా కీలకం. ఇవి మెదడు, మూతపిండాలు, కండరాల ఆరోగ్యకరమైన పనితీరుకు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపకరిస్తాయి. శరీరంలో పిండి పదార్థాల లోపం ఉన్నట్లయితే.. తలనొప్పి, అలసట, బలహీనతగా ఉంటుంది. మరి శరీర బరువును నియంత్రణలో ఉంచుతూ.. పోషకాలను అందించే పిండిపదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిలగడదుంప.. ఈ చిలగడ దుంపలో కార్పోహైడ్రేట్స్, ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో అధిక యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూనే.. ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

చిక్కుళ్ళు.. చిక్కుళ్ళలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో చిక్కుళ్ళను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. చిక్కుళ్ళలో ఉండే యాంటీఆక్సిడెంట్స్.. శరీరంలోని కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. అలాగే వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

పాల ఉత్పత్తులు.. పాలతో తయారు చేసిన అన్ని రకాల ఉత్పత్తుల్లో ఆరోగ్యకరమైన పండిపదార్థాలు ఉంటాయి. పాల ఉత్పత్తులు కండర నిర్మాణం పెరుగుదలకు, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

వివిధ రకాల పండ్లు.. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, కర్బూజ వంటి పండ్లలో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మీ శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటంతో పాటు వీటిలో సహజ చక్కెర కూడా ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు.. తమ రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా తినాలి. పండ్లను తినడం ద్వారా.. చెక్కెర పదార్థాలు తినాలనే కోరిక కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

తృణధాన్యాలు.. తృణధాన్యాలు బార్లీ, బ్రౌన్ రైస్, మిల్లెట్, బుక్వీట్ లలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సమతుల ఆహారం తీసుకునే వారు.. తమ డైట్‌లో తృణధాన్యాలు ఉండాలి. తృణధాన్యాలు ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి. అదే సమయంలో.. బరువు తగ్గించడంలో ఉపకరిస్తుంది.

Also read:

visakha steel plant: విశాఖ ఉక్కు అమ్మకంలో వెనక్కి తగ్గం.. పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

Hanuman Birth Place: పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసిన కేంద్రం.. తెరపైకి మళ్లీ హనుమంతుని జన్మస్థల వివాదం..

Suicide: విజయవాడలో దారుణం.. భర్త వేధింపులు తాళలేక మహిళ హోంగార్డ్ ఆత్మహత్య..