Khammam Crime: మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కూతురు చూసిందని.. తల్లి కర్కశత్వం

వివాహేతర సంబంధం ముసుగులో చిక్కుకుని కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తమ సంబంధం బయటపడుతుందన్న కారణంతో హత్యలు చేయడానికీ వెనుకాడటం లేదు. అయితే విచక్షణ మరిచిన...

Khammam Crime: మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కూతురు చూసిందని.. తల్లి కర్కశత్వం
woman murder
Follow us

|

Updated on: Feb 16, 2022 | 2:43 PM

వివాహేతర సంబంధం ముసుగులో చిక్కుకుని కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తమ సంబంధం బయటపడుతుందన్న కారణంతో హత్యలు చేయడానికీ వెనుకాడటం లేదు. అయితే విచక్షణ మరిచిన కొందరు తమ రక్తం పంచుకుని పుట్టిన పిల్లలనూ కడతేరుస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఖమ్మం(Khammam) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. మామతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళ.. తన కూతురునే అంతమొందించింది. తాము ఏకాంతంగా ఉన్న సమయంలో చిన్నారి చూసిందని.. తన మామతో కలిసి దారుణంగా హత్య(Murder) చేసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు కుమారుడికి సునీత అనే మహిళతో వివాహమైంది. సునీతకు 12 ఏళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా సునీతకు ఆమె మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక చూసింది. దీంతో సునీత.. తన మామతో కలిసి కన్న కూతురిని కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి చిన్నారిని చంపేసింది.

హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు సునీత, ఆమె మామ ఇద్దరూ అన్ని ప్రయత్నాలు చేశారు. బాలికకు అనారోగ్యంగా ఉందని, స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. పీహెచ్‌సీలో చనిపోయినట్లు నిర్ధారించకూడదని.. వెంటనే ఖమ్మం తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కూడా చిన్నారి చనిపోయిందని నిర్ధరించారు. తల్లి, తాత బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా తమకు అప్పగించాలని వైద్యులను కోరారు. చిన్నారి మెడపై వైరు బిగుసుకుపోయిన గుర్తులు ఉండటంతో వైద్యులకు అనుమానం కలిగింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

శవపరీక్ష నిర్వహిస్తే.. అసలు విషయం బయట పడుతుందని నిందితుడు నరసింహారావు పోస్టుమార్టం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. చిన్న పిల్లను కోయడం మంచిది కాదని, చూసి తట్టుకోలేమని ప్రాధేయపడ్డాడు. పోలీసులు, వైద్యులు అంగీకరించకుండా పోస్టుమార్టం చేశారు. అసలు విషయం బయట పడుతుండటంతో తప్పించుకునేందుకు గ్రామంలో మరో యువకుణ్ని ఇరికించాడు. ఆ యువకుడికి తన కోడలికి వివాహేతర సంబంధం ఉందని అతనే చంపాడని కోడలితో పోలీసులకు చెప్పించారు. అతణ్ని విచారించగా వివాహేతర సంబంధం నిజమేనని కాని హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు ఆధారాలు సేకరించి తల్లి సునీతను ప్రశ్నించడంతో విషయం బయటపడింది. అప్పటికే పోస్టుమార్టం నివేదికలో బాలిక హత్యకు గురైనట్లు నిర్ధరణ అయింది. నిందితులు నేరం అంగీకరించడంతో హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ చెప్పారు. చిన్న ఆధారంతో కేసుని ఛేదించిన పోలీసులను ప్రశంసించారు.

Also Read

PSL 2022: కౌంటర్ ఇద్దామనుకున్నాడు అడ్డంగా బుక్కయ్యాడు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆసక్తికర ఘటన

ఉదర సంబంధిత సమస్యలకు వీటితో చెక్ పెట్టండి

Bjp vs Trs: మోడీని తరిమేస్తారా.. బికేర్ ఫుల్.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత సీరియస్ వార్నింగ్!