Hyderabad: భాగ్యనగరంలో కాల్పుల కలకలం.. ఏటీఎం వాహన సిబ్బందిపై ఫైర్.. గాయాలు..
Kukatpally: భాగ్యనగరంలో కాల్పులు కలకలం రేపింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం
Kukatpally: భాగ్యనగరంలో కాల్పులు కలకలం రేపింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. పార్కు దగ్గర ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. యథావిధిగా సిబ్బంది వాహనంలో వచ్చి మధ్యాహ్నం వేళ హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో నగదును నింపుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు.. ఆ సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం డబ్బును అపహరించి అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం మేరకు వెంటనే.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు వివరాలను సేకరించారు. గాయపడిన భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు నగరంలో గాలిస్తున్నారు. సీసీ టీవీ పుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
కాగా.. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: