TS High Court: ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర హైకోర్టు అసహనం… ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని సూటి ప్రశ్న..!

రాష్ట్ర ఎన్నికల సంఘం..ఎస్‌ఈసీ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించింది.

TS High Court: ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర హైకోర్టు అసహనం... ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని సూటి ప్రశ్న..!
High Court
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 29, 2021 | 2:57 PM

Telangana High Court:  రాష్ట్ర ఎన్నికల సంఘం..ఎస్‌ఈసీ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఎస్‌ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా.. ఆకాశంలోనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా అని కోర్టు ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలకు వెళ్లినట్లు ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టుకు వివరించారు.

మరోవైపు, కరోనా తీవ్రతపై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపటితో రాత్రి కర్ఫ్యూ ముగుస్తున్నందున తర్వాత చర్యలేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలపగా.. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు అంటూ కోర్టు ఘాటుగా స్పందించింది. కనీసం ఒక రోజు ముందు చెబితే వచ్చే నష్టమేంటి అని అడిగింది. నియంత్రణ చర్యలపై ఎలాంటి సూచనలు ఇవ్వలేమన్న కోర్టు.. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా చెబుతానని కోర్టుకు వివరించారు ఏజీ బీఎస్ ప్రసాద్.

Read Also… ‘నా తల్లి చచ్చిపోతుంది, ఆక్సిజన్ సిలిండర్ తీసేయకండి’, ఆగ్రాలో ఓ వ్యక్తి రోదన ! నిజమేనా ?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!