కన్నకూతురిపైనే అఘాయిత్యం..విశాఖలో కీచక తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామాంధుడై కాటేశాడు. అభం శుభం తెలియని కూతురిపై కన్న తండ్రి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన..

కన్నకూతురిపైనే అఘాయిత్యం..విశాఖలో కీచక తండ్రి
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2020 | 4:03 PM

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామాంధుడై కాటేశాడు. అభం శుభం తెలియని కూతురిపై కన్న తండ్రి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లా మల్కాపురంలో చోటు చేసుకుంది.

విశాఖ జిల్లా మల్కాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలంగా తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కామాంధుడైన తండ్రి చేసిన పనికి స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.