చికెన్ వండలేదని భార్యను కొట్టిచంపాడు..

కోడి కూర వండలేదని భార్యను కొట్టి చంపాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నాగర్​కర్నూల్​జిల్లాలో జరిగింది.

చికెన్ వండలేదని భార్యను కొట్టిచంపాడు..
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 28, 2020 | 3:19 PM

కోడి కూర వండలేదని భార్యను కొట్టి చంపాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నాగర్​కర్నూల్​జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన నిమ్మల సన్నయ్య, సీతమ్మ భార్యభర్తలు. దసరా పండగ రోజు సన్నయ్య కోడి మాంసం తీసుకువచ్చి భార్య సీతమ్మను వండిపెట్టమని చెప్పగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన సన్నయ్య భార్య సీతమ్మ(38)ను పొలం వద్ద కట్టెతో విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను భర్త ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయింది. తెల్లారి 26న తన భార్య సారా తాగి చనిపోయిందని గ్రామస్తులతో నమ్మబలికాడు. స్థానికులకు అనుమానం రావడంతో భార్య శవాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి పారిపోయాడు. సీతమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సన్నయ్య కోసం గాలిస్తున్నామన్నారు.

ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
ఫ్రెషర్స్‌కు భారీ గుడ్‌న్యూస్‌.. టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు!
ఫ్రెషర్స్‌కు భారీ గుడ్‌న్యూస్‌.. టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు!
అక్కడ బ్రతుకు కంటే చావే నయం..
అక్కడ బ్రతుకు కంటే చావే నయం..
ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్ 5 బ్యాంకులు
ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్ 5 బ్యాంకులు
సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట.. వివరాలు ఇవిగో
సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట.. వివరాలు ఇవిగో
ఏపీలో వాతావరణం ఎలా ఉండనుంది.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఏపీలో వాతావరణం ఎలా ఉండనుంది.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో