Telangana: బడికి వెళ్లి చదువుకుంటామన్నందుకు పిల్లలపై తండ్రి దాష్టీకం.. చిత్రహింసలు

బడి కెళ్లి చదువకుంటా.. నాన్న అంటే, ఆ తండ్రి.. పిల్లలను గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. చెప్పినమాట వినడం లేదంటూ.. చిత్రహింసలు పెడుతున్నాడు.

Telangana: బడికి వెళ్లి చదువుకుంటామన్నందుకు పిల్లలపై తండ్రి దాష్టీకం.. చిత్రహింసలు
Ather Harassing Children
Follow us

|

Updated on: Sep 18, 2021 | 4:14 PM

బడి కెళ్లి చదువకుంటా.. నాన్న అంటే, ఆ తండ్రి.. పిల్లలను గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. చెప్పినమాట వినడం లేదంటూ.. చిత్రహింసలు పెడుతున్నాడు. తాగిన మైకంలో తల కోసేస్తానంటాడు. తండ్రి పెట్టే దెబ్బలకు తట్టుకోలేక.. పిల్లలు పోలీసులకు ఫోన్ చేశారు. పరాయి వ్యక్తులు కొడితే.. ప్రశ్నించాల్సిన తండ్రే అతి దారుణంగా చావబాదుతుంటే.. పాపం ఆ చిన్నారులు ఏం చేస్తారు చెప్పండి. నాన్నా.. నన్ను కొట్టొద్దూ అంటూ వేడుకుంటున్నారు. అయినా ఆ దుర్మార్గుడు వదలడం లేదు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం కోమటికుంటలో జరిగింది. తనతో పాటు పనికి రావాలంటూ.. ఇద్దరు కన్న బిడ్డలను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. బడికి వెళ్లి చదువుకుంటానంటే.. చావకొడుతున్నాడు. తాను చెప్పినట్లుగా పనికి రావాలంటూ రక్తం వచ్చేలా కొడుతున్నాడు. తండ్రి పెట్టే హింసలు తట్టుకోలేక.. డయల్ 100కు ఫోన్ చేశారు పిల్లలు.తమ తండ్రి నుండి కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. చావబాదుతున్న దృశ్యాలును రికార్డు చేసిన స్థానికులు, పోలీసులకు అందించారు. ఈఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. తండ్రిని మందలించి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

హైదరాబాద్: రెండేళ్ల కుమారుడ్ని తండ్రే చంపేశాడు

రెండేళ్ల కుమారుడిని అతి కిరాతంగా హత్య  చేశాడో తండ్రి. ఈ ఘటన హైదరాబాద్​లోని లంగర్‌హౌస్‌ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్‌, ప్రశాంత్‌నగర్‌కు చెందిన హసీబ్‌(38)కు, మొఘల్‌కానా ఏరియాకు చెందిన హస్రత్‌ బేగం(30)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇస్మాయిల్‌(2), రెహాన్‌(8 నెలలు) సంతానం. మూడేళ్ల క్రితం వరకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన హసీబ్‌ అప్పుడప్పుడు కాస్త తేడాగా ప్రవర్తిస్తుంటారు. అతడి బిహేవియర్ బాగా లేకపోవడంతో కంపెనీ జాబ్ నుంచి తీసేసింది. ఇంట్లోనే ఉంటూ తరచూ పెద్దగా అరుస్తూ హంగామా చేస్తుంటాడు. భార్య హస్రత్​తో తరచూ గొడవ పడుతుంటాడు. తన పెద్ద కుమారుడు ఇస్మాయిల్ తన కుమారుడు కాదంటూ ఆమెను వేధిస్తుంటాడు.

శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు ఇస్మాయిల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆడుకుంటున్నాడు. మొదటి అంతస్తు నుంచి కిందికి వచ్చిన తండ్రి.. కుమారుడ్ని ఫస్ట్ ఫ్లోర్‌లోని గదిలోకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోశాడు. గదిలోనే పడేసి కిందికి దిగి పారిపోయాడు. హసీబ్‌ చేతులకు రక్తం ఉండడం గమనించిన అతని తల్లి ఖుస్రూబేగం, భార్య హస్రత్‌బేగం పరుగెత్తుకుంటూ మొదటి అంతస్తులోకి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న ఇస్మాయిల్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ శివమారుతి ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి హసీబ్‌ కోసం గాలిస్తున్నారు.

Also Read: చిక్కుల్లో సోనూసూద్.. పన్ను ఎగవేతపై ఐటీ శాఖ కీలక ప్రకటన.. షాక్‌లో అభిమానులు

పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో వధువు జంప్… ట్విస్ట్ ఏంటంటే