Grain Money Scam: రైతుల ధాన్యం సొమ్ము గోల్‌మాల్.. 11 మంది బినామీల ఖాతాల్లో జమ.. వడ్ల పైసల్ బుక్కిన సర్పంచ్..!
ఆరుగాలం కష్టపడి పంటపండిస్తే.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో గోల్‌మాల్ చేశారు కొందరు కేటుగాళ్లు. రైతుల ఖాతాల్లో పడాల్సిన లక్షల రూపాయలు స్వాహా చేశారు.
Grain Money Scam: ఆరుగాలం కష్టపడి పంటపండిస్తే.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో గోల్‌మాల్ చేశారు కొందరు కేటుగాళ్లు. రైతుల ఖాతాల్లో పడాల్సిన లక్షల రూపాయలు స్వాహా చేశారు. బీనామీల పేర్లతో తెరిచిన అకౌంట్లలో వేసుకున్నారు. చేతికందాల్సిన సొమ్ము రాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమను మోసం చేసిన గ్రామ సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించారు అన్నదాతలు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.
లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామ రైతులు రోడ్డేక్కారు.. వడ్లు కొనుగోలు విషయంలో గోల్‌మాల్ జరిగిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు ఇంచార్జ్ సర్పంచ్ సాయి నరేష్ ఈ గోల్‌మాల్‌కు పాల్పడినట్లు గ్రామ రైతులు ఆరోపించారు. తమ న్యాయం చేయాలంటూ ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఆశ్రయించారు. గ్రామంలోని ప్రతీ రైతు ఇంట్లో నుంచి ఒకరు చొప్పున వచ్చి ఎమ్మెల్యేకు తమ సమస్యలను వివరించారు. దీనిపై నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
అసలేం జరిగిందంటే… రైతుల వద్ద నుంచి యాసంగి పంట అయిన వరిని, డీసీఎంఎస్ ద్వారా కొనుగోళ్లు జరిపారు. అయితే, తాలు తరుగు పేరిట కొంత ధాన్యం పోగా, మిగతా ధాన్యం డబ్బులు అయినా సరిగ్గా పడతాయి అనుకుంటే డీసీఎంఎస్ ఇంచార్జి గ్రామ సర్పంచ్ అయిన నరేశ్.. అవకతవకలకు పాల్పడినట్టు బాధిత రైతులు వాపోయారు. ధాన్యం డబ్బులు కొంత మేరకు తమ బినామీలు అకౌంట్లలో వేయించుకున్నట్లు రైతులు తెలిపారు. దాదాపు రూ. 35 లక్షలపైగా పక్కదారి పడ్డాయని గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత అధికారులతో మాట్లాడి.. కనకాపూర్ రైతులకు తప్పక న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
Read Also…. Bangarraju: బరిలోకి దిగుతున్న బంగార్రాజు.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్.. నాగ్‌తోపాటు నాగచైతన్య కూడా..