AP Crime News: తస్మాత్ జాగ్రత్త…! అచ్చం ఒరిజినల్ శానిటైజర్‌లానే.. ఏపీలో కల్తీ బ్యాచ్‌లు
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా.. కొందరు కంత్రీగాళ్లు అన్నీ కల్తీ చేస్తున్నారు. సమయం, సందర్భం ఏదైనా సరే.. కాసుల వేటే లక్ష్యంగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా.. కొందరు కంత్రీగాళ్లు అన్నీ కల్తీ చేస్తున్నారు. సమయం, సందర్భం ఏదైనా సరే.. కాసుల వేటే లక్ష్యంగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కరోనా కల్లోలంలో అత్యవసరంగా వాడుతున్న శానిటైజర్లు సైతం నకిలీవి సృష్టిస్తూ.. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు జగత్‌జంత్రీగాళ్లు. ఏపీలో జోరుగా సాగుతున్న శానిటైజర్ల దందాను డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. తాజాగా ఏపీలో పలు జిల్లాల్లో కల్తీ శానిటైజర్ల మాఫియా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒరిజినల్స్ కు ఫేక్ కు గుర్తించలేనంతగా మాయ చేస్తున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా కల్తీ శానిటైజర్లను కేటుగాళ్లు తయారు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీ లేబుళ్ల పేరుతో ఈ నయా దందా కొనసాగుతోంది. ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ కల్తీ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగి దాడులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ శానిటైజర్ల దందా గుట్టు రట్టు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.. స్వస్తిక్ ఫార్మా కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో శానిటైజర్లు విక్రయించే షాపులపై దాడులు నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఈ కల్తీ శానిటైజర్ల దందా జోరుగా కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా ప్రస్తుతం మహమ్మారి వైరస్‌తో పోరాటం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాం. ఈ క్రమంలో కల్తీ గాళ్లు, బ్లాక్ మర్కెట్ కిరాతకులు రెచ్చిపోతున్నారు. కరోనా రాకుండా వినియోగించే శానిటైజర్లను కల్తీ చేయడంతో పాటు.. కరోనా ట్రీట్మెంట్ లో భాగంగా ఉపయోగించే మెడిసిన్, ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మకుంటున్నారు. ఈ కంత్రీ బ్యాచ్‌లపై పోలీసులు సీరియస్‌గా పోకస్ పెట్టాల్సిన ఆవశ్యకతం ఉంది.
Also Read: తెలంగాణలో కొత్తగా 3,762 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా