Big Accident: నడి సముద్రంలో ఢీకొన్న రెండు దేశాలకు చెందిన పడవలు.. ముగ్గురు మృతి..

Big Accident: జపాన్, రష్యాకు చెందిన రెండు ఓడలు సముద్రంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జపాన్‌ హక్కైడోలోని..

Big Accident: నడి సముద్రంలో ఢీకొన్న రెండు దేశాలకు చెందిన పడవలు.. ముగ్గురు మృతి..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 26, 2021 | 7:59 PM

Big Accident: జపాన్, రష్యాకు చెందిన రెండు ఓడలు సముద్రంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జపాన్‌ హక్కైడోలోని ఒఖోట్స్క్ సముద్రంలో ప్రమాదం జరిగింది. జపాన్‌కు చెందిన ఫిషింగ్ నౌక, రష్యాకు చెందిన కార్గో షిప్‌ సముద్రంలో ఢీ కొన్నాయి. రెండు ఓడలు బలంగా ఢీకొనడంతో జపాన్ ఓడ బోల్తా పడింది. ఈ ఘటనలో జపాన్ షిప్‌లోని ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురిని రష్యన్ కార్గో షిప్ సిబ్బంది రక్షించారు. ఇక రష్యా ఓడలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి కట్స్‌నోబు కటో వెల్లడించారు. కాగా, ప్రమాదానికి గురైన షిప్‌లు.. జపాన్‌కు చెందిన 9.7 టన్నుల డైహాచి హోకో మారు షిప్, రష్యాకు చెందిన 662 టన్నుల ఏఎంయూఆర్ షిప్ ‌లుగా గుర్తించారు.

కాగా, దట్టమైన పొగమంచు కారణంగానే ఓడలు ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. రష్యాకు చెందిన ఓడనే ఢీకొట్టిందని.. పడమ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు. తాము ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లామని, ఇంతలోనే రష్యాకు చెందిన భారీ నౌక తమ నౌకను ఢీకొనడంతో బోల్తా పడిందన్నారు. ఘటన జరిగిన సమయంలో సముద్రం పూర్తిగా ప్రశాంతంగా ఉందన్నారు. ఇదిలాఉంటే.. ప్రమాదానికి గురైన రష్యన్ నౌక.. ప్రతీసారి ఇదే మార్గంలో వెళ్తుందని, కానీ ఏనాడూ ఇలాంటి ప్రమాదం జరిగలేదని రష్యన్ కోస్టల్ గార్డ్స్ చెబుతున్నారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. జపాన్‌కు చెందిన ఓడలో మొత్తం 23 మంది ఉండగా.. ముగ్గురు మినహా అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు.

Also read:

Tirumala : వర్ణనాతీతంగా తిరుమల క్షేత్రంలోని వర్తకుల అవస్థలు, బోణి కూడా కావడం లేదని ఆవేదన, ఆదుకోవాలని విన్నపం

ima letter to pm modi : యోగాగురు బాబా రాందేవ్ బాబా తప్పుడు ప్రచారాన్ని ఆపండి.. ప్రధాని మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ

Nandamuri Kalyan Ram: ఇంటరెస్టింగ్ స్టోరీతో రానున్న కళ్యాణ్ రామ్.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సినిమా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే