Tirumala : వర్ణనాతీతంగా తిరుమల క్షేత్రంలోని వర్తకుల అవస్థలు, బోణి కూడా కావడం లేదని ఆవేదన, ఆదుకోవాలని విన్నపం

Tirumala traders : నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలోని వర్తకుల అవస్థలు ప్రస్తుతం వర్ణనాతీతంగా ఉన్నాయి.

Tirumala : వర్ణనాతీతంగా తిరుమల క్షేత్రంలోని వర్తకుల అవస్థలు, బోణి కూడా కావడం లేదని ఆవేదన, ఆదుకోవాలని విన్నపం
Tirumala Stores
Follow us

|

Updated on: May 26, 2021 | 7:56 PM

Tirumala traders : నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలోని వర్తకుల అవస్థలు ప్రస్తుతం వర్ణనాతీతంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా భక్తుల రాక బాగా తగ్గిపోయి బోణి కూడా కావడం లేదని చిరు వర్తకులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ తో అల్లాడిపోగా, ఇప్పుడు సెకండ్ వేవ్ తమ జీవితాల్ని చిన్నాభిన్నం చేసిందంటున్నారు. కరోనా కష్టాలు తమను నీడలా వెంటాడుతున్నాయని వాపోతున్నారు.  13 నెలలుగా వ్యాపారాలు లేక, అమ్మకాలు లేక, తమకు కరోనా అంతులేని కష్టాన్ని మిగిల్చిందంటూ దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం 50 వేలకు పైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. దేవదేవుని సన్నిధిలో ఎంతో మంది బ్రతుకుతుంటారు. అయితే, ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రం.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వెలవెలబోతోంది. కరోనా వైరస్ ప్రభావంతో, వరుస లాక్ డౌన్ల నేపథ్యంలో తిరుమల సందర్శించే  భక్తులు రాక బాగా తగ్గి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల కుంటుబాలు ఇప్పుడు కష్టాల కడలిని ఈదుతున్నాయి.

తిరుమలలో మూడు వేలకుపై దుకాణాలు, 100 కు పైగా పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఇవే కాక.. రోడ్డు పక్కన ఉన్న రెండు వందల టీ స్టాల్స్ ఇప్పుడు పూర్తిగా మూతబడే స్థితికి వచ్చాయి. సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌తో ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య 5 వేలకు పరిమితమైంది. ఆ భక్తులు కూడా కరోనాకు భయపడి దర్శనం తర్వాత నేరుగా తిరుగు ప్రయాణమవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లాక్‌డౌన్ ఉండడంతో వచ్చే వారు లేక వ్యాపారం బోణి కూడ కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. టీటీడీకి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ వ్యాపారస్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read also : Hyderabad water supply : హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక : గురు, శుక్రవారాల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం 

Latest Articles