Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 3,762 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
తెలంగాణలో కొత్తగా మరో 3,762 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.
తెలంగాణలో కొత్తగా మరో 3,762 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,63,903కు చేరగా.. మరణాల సంఖ్య 3189కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 38,632 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 528 కేసులు, ఖమ్మం జిల్లాలో 214, రంగారెడ్డి జిల్లాలో 229, మేడ్చల్ జిల్లాలో 213, సూర్యాపేట జిల్లాలో 178 కేసులు వెలుగుచూశాయి. తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కట్టడికి అన్ని శాఖలు సమష్టిగా కృషిచేస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో కరోనా పాటివిటీ రేటు 4.1శాతంగా ఉందన్నారు. ఇప్పటివరకు 1.47కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200లకు పెంచుతున్నట్టు వివరించారు. తెలంగాణలో ఇప్పటివరకు 56 లక్షల మందికి టీకాలు వేసినట్టు డీహెచ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి 10 మందిలో నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు.
తెలంగాణలో ఇప్పటివరకు 56 లక్షల మందికి టీకాలు వేసినట్టు డీహెచ్ వెల్లడించారు. ప్రస్తుతం 6.18 లక్షల కొవిషీల్డ్, 2.5లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండే వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వారికి ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ చేయనున్నట్టు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్‌ఎంసీ ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 4.1శాతం; రికవరీ రేటు 92.52శాతంగా ఉందన్న ఆయన.. మరణాల రేటు 0.56శాతంగా ఉందని తెలిపారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి